వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు వెంబడి 300 మంది ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్ ఐజీ

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: సరిహద్దు వెంబడి పాకిస్థాన్ లాంచ్ ప్యాడ్‌ల వద్ద 250-300 మంది పాక్ ఉగ్రవాదులు పొంచివున్నారని బీఎస్ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. పాక్ ఉగ్ర చొరబాట్లను ఇప్పటికే భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు.

పాకిస్తాన్ ఇటీవల కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా పౌరులకు వారి ఆస్తులకు నష్టం కలిగించడంతో సహా చాలా హాని జరిగిందని మిశ్రా చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని చెప్పారు.

 Around 300 terrorists present at each launching pad of Pakistan: BSF IG

నవంబర్ 13న సరిహద్దుల వెంబడి పాక్ సైనికులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులతోపాటు మరో ముగ్గురు భారత పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. యూరీ సెక్టారులో ఇద్దరు సైనికులు మృతి చెందారు.

కాగా, గత కొద్ది నెలలుగా పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతుండగా, పాక్ ఉగ్రవాదులు మనదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. పాక్ చర్యలను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.

ఆరుగురు భారతీయుల ప్రాణాలు తీసిన పాక్‌పై భారత్ ప్రతీకారం కూడా తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని పలు ఉగ్ర ఆయుధ ట్యాంకులపై భారత్ తేలికపాటి క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసింది. దీంతో అనేక ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 8-10 మంది వరకు పాక్ ఉగ్ర, సైనికులు హతమైనట్లు తెలిసింది.

English summary
Rajesh Mishra, BSF Inspector General (IG), Kashmir has said that there are 250-300 terrorists across the border, present at each launching pad in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X