హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో అరెస్టైన గ్యాంగ్‌స్టర్ సంపత్.. సల్మాన్ హత్యకు ప్లాన్ వేశాడు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రా ద్వారా కుట్ర జరుగుతోందని హర్యానా పోలీసులు గుర్తించారు. హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న సంపత్ నెహ్రాను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 ఇప్పటికే సల్మాన్ ఇంటివద్ద రెక్కీ..

ఇప్పటికే సల్మాన్ ఇంటివద్ద రెక్కీ..

విచారణలో ఇతడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగుచూశాయి. అనేక హత్యలు చేసిన నెహ్రా.. సల్మాన్‌ఖాన్‌ను హత్యకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్‌ ఇంటి వద్ద నెహ్రా రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోనే అరెస్ట్

హైదరాబాద్‌లోనే అరెస్ట్

సంతప్‌ నెహ్రా అనే వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు ఆ పనిమీదే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం నెహ్రా ముంబయికి కూడా వెళ్లాడట. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిని, అక్కడికి వెళ్లే మార్గాలను తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కరుడుగట్టిన నేరస్తుడు, డాన్ సంపత్ నెహ్రా అరెస్ట్ కరుడుగట్టిన నేరస్తుడు, డాన్ సంపత్ నెహ్రా అరెస్ట్

సల్మాన్ హత్యకు ప్లాన్

సల్మాన్ హత్యకు ప్లాన్

‘కృష్ణజింక కేసులో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేస్తామని బిష్ణోయ్‌ వర్గం హెచ్చరించిన విషయం తెలిసిందే. నెహ్రా ఇటీవల ముంబైకి వెళ్లి సల్మాన్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. హత్య చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు కూడా నెహ్రా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు' అని పోలీసులు తెలిపారు.

లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రధాన అనుచరుడే ఈ సంపత్‌

లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రధాన అనుచరుడే ఈ సంపత్‌

హర్యానాలోని ఘారానా నేరస్థుడు లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రధాన అనుచరుడే ఈ సంపత్‌. ఇతడు కూడా బిష్ణోయ్‌ వర్గానికి చెందినవాడే. కాగా, కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్‌కు ఇటీవల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు. ఇదిలా ఉండగా.. సల్మాన్‌ను చంపేస్తామంటూ బిష్ణోయ్‌ వర్గం ఆ మధ్య బెదిరింపులకు పాల్పడింది. అందులో భాగంగానే నెహ్రాతో కలిసి సల్మాన్‌ హత్యకు కొందరు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Wanted gangster Sampat Nehra, who was arrested by the Haryana Police earlier this week, was working on a plan to kill actor Salman Khan, say police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X