• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశ్మీరీల హ‌క్కు 35ఏ: ర‌ద్దు చేస్తున్నారంటూ ప్ర‌చారం: ఈ చ‌ట్టం ఎందుకు..ఏం చెబుతోంది..!

|

జ‌మ్ము-కాశ్మీర్‌లో క్ష‌ణం క్ష‌ణం ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పుడు దేశంలోనే కాదు అంత‌ర్జాతీయంగా అంద‌రి దృష్టి భార‌త ప్ర‌భుత్వం మీద‌నే. ప్ర‌ధాని మోదీ సార‌ధ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం కాశ్మీర్ పైన ఏ నిర్ణ‌యం తీసుకోనుంది.. ఎందుకింత‌గా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది అనే చ‌ర్చ మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా సాగుతోంది. చ‌రిత్ర‌లో ఎన్న డూ లేని విధంగా అమ‌ర‌నాధ్ యాత్ర‌ను ర‌ద్దు చేయ‌టం ద్వారా ఖ‌చ్చితంగా సంచ‌ల‌న నిర్ణ‌యం ఉంటుంద‌నే అంశం స్ప‌ష్టం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ఎంతో కాలంగా భిన్నాభిప్రాయ‌లు ఉన్న 35ఏ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసే దిశ‌గానే కేంద్రం ఈ అడుగులు వేస్తుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇంత‌కీ ఈ 35ఏ చ‌ట్టం ఏంటి..ఏం చెబుతోంది. ఇది ర‌ద్దు చేస్తార‌నే ప్ర‌చారంతో కాశ్మీర్‌లో ఎందుకింత అల‌జ‌డి..

కాశ్మీర్‌లో టెన్ష‌న్‌: అర్ద‌రాత్రి మాజీ ముఖ్య‌మంత్రుల అరెస్ట్‌:కాసేప‌ట్లో కేంద్ర కేబినెట్ స‌మావేశం

 శాశ్వ‌త నివాసుల నిర్వ‌చ‌న‌మే 35ఏ..

శాశ్వ‌త నివాసుల నిర్వ‌చ‌న‌మే 35ఏ..

జ‌మ్ము కాశ్మీర్‌కు ప్ర‌త్యేక‌గా వ‌ర్తించే అధికారాలు..హ‌క్కుల్లో భాగంగా ఈ 35ఏ చ‌ట్టం ఒక‌టి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో శాశ్వ త నివాసులు అనే అంశానికి అక్క‌డ ఉన్న వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనసభ కు ఆర్టికల్‌ 35ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని ఉపయోగించి శాసనసభ శాశ్వత నివాసు లను నిర్ధారించింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం 1911కు ముందు జమ్మూ కశ్మీర్‌లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు వచ్చిన వారెవరూ అక్కడ స్థిరాస్తులు కొనకూడదనే నిబంధ‌న ఉంది. ప్రభుత్వోద్యోగాలు చేయకూడదు. ఉపకా ర వేతనాలు, ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అనర్హులు. ఓటు వేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదు.

వివాహం వ‌విష‌యంలోనూ వ‌ర్తించేలా..

వివాహం వ‌విష‌యంలోనూ వ‌ర్తించేలా..

అదే విధంగా మ‌రింత ప‌క‌డ్బందీగా ఉందేందుకు శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులు కూడా హరించుకుపోతాయని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. కానీ కశ్మీరీ అబ్బాయిల విషయంలో ఇది వర్తించదు. అయితే 2002 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది. దీని పైన ఆ త‌రువాత సుప్రీంలో పిటీష‌న్ సైతం దాఖ‌లైంది.ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాం గాన్ని సవరించకుండా, పార్లమెంటులో చర్చించకుండా అధికరణం 35ఏను రాజ్యాంగంలో చేర్చారనీ, కాబట్టి అది చెల్లదని ఢిల్లీకి చెందిన స్వ‌చ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆర్టికల్‌ 35ఏపై చర్చ అంటే దాదాపుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370పై చర్చగానే భావించాల్సి ఉంటుంది.

వేడి పుట్టిస్తున్న కేంద్రం అడుగులు..

వేడి పుట్టిస్తున్న కేంద్రం అడుగులు..

ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం 35ఏ చ‌ట్టం పైన కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు విస్తృతంగా ప్ర‌చారం సాగు తోంది. జ‌మ్ము కాశ్మీర్‌లో ఉన్న వారు దీనిని పూర్తి స్థాయిలో వ్య‌తిరేకించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీని కార‌ణం గానే పెద్ద ఎత్తున బ‌ల‌గాల మోహ‌రింపుతో పాటుగా..అన్ని ర‌కాల ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బీజేపీ అనుకూల వ‌ర్గాలు మాత్రం 370, 35ఎ అధికరణాలకు కాలం చెల్లిపోయిందని, వాటిని రద్దు చేయాల్సిందేనని వాదిస్తున్నారు. కశ్మీ రీల ప్రత్యేక హక్కులపై రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో 35ఎ అధికరణం ఏర్పాటు చేసేందుకు 1952లో నెహ్రూ, షేక్ అబ్దుల్లా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాతే జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటైంది.ఇప్పుడు బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌చారంలో ఉన్న విధంగా 35ఏ అధిక‌ర‌ణం ర‌ద్దుకు అడుగు వేస్తే..కాశ్మీర్‌లో ఎటువంటి స్పంద‌న వ‌స్తుంద‌నేది..అందునా ఇంత హ‌డావుడిగా ఎందుకు నిర్ణ‌యం తీసుకుంటున్నార‌నేది ఉత్కంఠ‌కు కార‌ణం అవుతోంది.

English summary
Article 35A, relating to special rights and privileges of the citizens of Jammu and Kashmir, is now caused for hot discussion in over all nation. Central Govt may take crucial decision on this article. In this situation What the 35A says..why the Jammu and Kashmir people want to continue this article.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X