వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్ 371పై ఆందోళనలు అవసరం లేదు.. అమిత్ షా

|
Google Oneindia TeluguNews

ఆర్టికల్ 371 పై రద్దుపై ఎలాంటీ ఆందోళనలు అవసరం లేదని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 371లో నిబంధనలు ఎప్పటిలాగే కొనసాగుతాయని హమి ఇచ్చారు.కశ్మీర్ విభజనపై చర్చలో భాగంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశంపై ఆయన సమాధానం ఇచ్చారు.

జమ్ము కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాలను రద్దు చేయడంతో భారత దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే, ఈనేపథ్యంలోనే ఆర్టికల్ రద్దుపై బిన్నభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ అయిన 371 కూడ రద్దు చేస్తారనే చర్చకు తేరలేసింది. ఆర్టికల్ 370 వలనే 371 కూడ ప్రత్యేక అధికారాలను కల్గి ఉంది. 371ఏ నుండి 371జే వరకు పలు రాష్ట్రాలకు పత్యేక అధికారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడ ప్రత్యేక అధికారాల జాబితాలో ఉంది.

<strong>గొర్రెల్లా కశ్మీరీలను బలి ఇస్తున్నారు.. కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ </strong>గొర్రెల్లా కశ్మీరీలను బలి ఇస్తున్నారు.. కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్

ఈ ఆర్టికల్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక పరిరక్షణలు ఉండడంతో పాటు, వెనకబడిన ప్రాంతాల అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. కాగా ఈ ఆర్టికల్ క్రింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు, గుజరాత్, మహరాష్ట్ర,ఆసోం, మణిపూర్,సిక్కిం,మిజోరం,కర్ణాటక,ఆరుణచల్ ప్రదేశ్,గోవా, రాష్ట్రాలు ఉన్నాయి.

Article 371 would continue as usual :Amit Shah

కాగా ఈ నిబంధన ప్రకారం రాష్ట్రంలోని విద్యా,ఉపాధి రంగాల్లో స్థానికులకు సమాన అవకాశాలు కల్పించే వెసులుబాటు కల్గి ఉంది. ఉద్యోగులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్రపతి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్టికల్ 371ఇ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్శిటిని ఏర్పాటు చేశారు.

English summary
Union Home Minister Amit Shah has made it clear that that the provisions of Article 371 would continue as usual
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X