వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి జైట్లీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణై జైట్లీ నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకంలో భాగంగా గుజరాత్‌లోని వడోదర జిల్లాలో కర్ణాలి, పిపాలియా, వలీదా, బాగ్లీపురా గ్రామాలను దత్తత తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు.

ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై స్వాతంత్య దినోత్సవ ప్రసంగం సందర్బంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ పథకం ద్వారా ఎంపీలు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం తగిన నిధులను కేటాయిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల గ్రామాల్లో 2019 కల్లా సుమారు 2,500 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది మోడీ సంకల్పమని గుర్తు చేసుకున్నారు.

English summary
Finance Minister Arun Jaitley on Sunday adopted four villages in Vadodara district in Gujarat as part of the Sansad Adarsh Gram Yojana for MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X