వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యుహకర్త, ధీశాలి మిస్ : మోడీ 2.0లో లేని మహానేతలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో మోడీ 2.0 క్యాబినెట్ కొలువుదీరనుంది. 60 మంది మంత్రులతో నమో టీం ఉంటుంది. అయితే ఇందులో ఇద్దరు ప్రముఖులు లేరు. ఒకరు మేధావి కాగా, మరొకరు మంచి ప్రజాబలం ఉన్న నేత .. వీరిద్దరూ అనారోగ్య కారణాల వల్లే మంత్రివర్గంలో చేరడం లేదని స్పష్టంచేశారు.

 ఇద్దరు కీలక నేతలు లేని ..

ఇద్దరు కీలక నేతలు లేని ..

ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించి అధికారం చేపట్టిన మోడీ .. కాసేపట్లో మరోసారి ప్రమాణం చేయనున్నారు. అయితే ఓ బలమైన నేత, మేధావి అయిన జైట్లీ ఈసారి క్యాబినెట్‌లో ఉండటం లేదు. అనారోగ్య సమస్యల వల్లే తాను మంత్రివర్గంలో చేరానని .. ఇదివరకే జైట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సుష్మా స్వరాజ్ కూడా వయోభారంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా తనను క్యాబినెట్ లోకి తీసుకోవద్దని మోడీకి స్పష్టంచేశారు. సుష్మస్వరాజ్ .. మంచి నేత, ప్రజాధారణ ఎక్కువ గల లీడర్. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి .. ప్రవాస భారతీయుల సమస్యలను తీర్చారు. దీంతో ఆమె పేరు అమ్మగా చెరగని ముద్రపడిపోయింది. ఇప్పుడు అమ్మలేని మోడీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది.

నంబర్ 2 ..

నంబర్ 2 ..

గత ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా దింపి బీజేపీ వ్యుహాత్మకంగా వ్యవహరించింది. అప్పటికే అద్వానీ, మురళిమనోహర్ జోషి లాంటి పెద్ద నేతలు ప్రధాని రేసులో ఉన్నా .. మోడీవైపు ఆరెస్సెస్ మొగ్గుచూపింది. అలానే మోడీ తొలి మంత్రివర్గంలో జైట్లీ కూడా కీ రోల్ పోషించారు. ప్రధాని తర్వాత స్థానం ఆయనే పోషించారు. మోడీ తర్వాత జైట్లీ కార్యాలయం ఎక్కువ ప్రభావ చూపేలా పనిచేసిందని .. ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతారు. అంతేకాదు మోడీ ప్రవేశపెట్టిన చాలా పథకాలకు ఆద్యుడు జైట్లీనే. ఆర్థికమంత్రి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టారు.

సంక్షేమం వెనుక

సంక్షేమం వెనుక

జన్ ధన్ యోజన, ఆధార్ అనుసంధానం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బినామీ ఆస్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కారణమయ్యారు. జైట్లీ సలహాలతోనే మోడీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజాధరణ చూరగొన్నారు. న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన జైట్లీ .. వివిధ అంశాలపై సుప్రీంకోర్టుకు సమాచారం అందించేవారు. పెద్దనోట్ల రద్దు తర్వాత వెల్లువెత్తిన నిరసనలను, జీఎస్టీ, రాఫెల్ ఒప్పందంపై విపక్షాల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రతిపక్షాలకు తనదైన సమాధానం చెప్పి ఒప్పించగలిగారు. అంతేకాదు రాహుల్ గాంధీని కూడా తన మాటలతో ఆకట్టుకొన్న ధీశాలి జైట్లీ.

పర్యటనల వెనుక

పర్యటనల వెనుక

ఓ దేశ దౌత్య నీతి విదేశీ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి కీలక శాఖను చేపట్టి మరింత వన్నెతీసుకొచ్చారు సుష్మస్వరాజ్. తొలివిడతలో నరేంద్ర మోడీ దాదాపు 90 దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాల్లో ఇండియాకున్న ప్రజాదరణను వివరించి .. పెట్టుబడుదారులను ఆకర్షించారు. ఇంతరకు మనకు తెలుసు .. కానీ ఆయా దేశాల్లో మోడీ పర్యటించేందుకు కారణం సుష్మ స్వరాజే. విదేశాంగా మంత్రిగా ఆయా దేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని .. దౌత్యపరంగా ముందుకెళ్లడంతో దేశానికి పెట్టుబడులు రాగలిగాయి. లేదంటే మనదేశానికి విదేశాల నుంచి ఇంత పెద్దస్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉండేవి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు 2014లో అధికారం చేపట్టిన వెంటనే ... ఐక్యరాజ్యసమితిలో ప్రధానిగా మోడీ మాట్లాడేందుకు కూడా సుష్మ పాత్ర ఉంది. అప్పటికే సుష్మ స్వరాజ్ మాట్లాడాలని మోడీ కోరగా .. అందుకు తిరస్కరించారు. మోడీ చేత ప్రసంగించి దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింజేశారు.

English summary
narendra Modi is back with a bang in the Prime Minister’s Office. Arun Jaitley was PM Modi's go-to-man for his first tenure. The two had chemistry since the days Narendra Modi was the Gujarat chief minister. Jaitley was among the first group of central BJP leaders who foresaw a leadership role for Narendra Modi. Foreign affairs was another key area for the Modi government-I. During his first tenure, the prime minister visited more than 90 countries and devoted a lot of energy in building Brand India to attract investment and nourish India’s diplomatic muscle. Sushma Swaraj proved the most important cog in the wheel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X