వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడ్జెట్: ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అరకొర కేటాయింపులు
న్యూఢిల్లీ: 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అరకొరగానే కేటాయింపులు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017-18తో పోల్చితే నామమాత్రంగానే ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.
గత బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 31,920 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్లో ఎస్ సీ సంక్షేమానికి రూ. 56,619, ఎస్ టీ సంక్షేమానికి రూ. 39,135 కోట్లు కేటాయించారు.


Union Budget 2018 : Agriculture, Health, Education got big Budgetary Allocations
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపు స్వల్పంగా పెరగడం గమనార్హం. గ్రామీణ, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతూనే కీలక ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంక్షేమానికి మొక్కుబడి కేటాయింపులు జరిపారు.