వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజన సమయంలో..ఏపీ పక్షాన జైట్లీ : హోదా కోరారు..ప్యాకేజి ప్రతిపాదించారు ..!!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విభజన సమయంలో 2014లో అరుణ్ జైట్లీ రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. అప్పటికే లోక్ సభ లో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందింది. లోక్ సభలో విభజన బిల్లు నిరసన మధ్య..ఏపీ ఎంపీలను సస్పెండ్ చేసి..ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి..మూజు వాణీ ఓటుతో బిల్లును ఆమోదించారు. అయితే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ లోక్ సభలో కనీసం ఏపీ గురించి ప్రస్తావించలేదనే విమర్శలు వెల్లు వెత్తాయి. దీంతో..విభజన బిల్లు రాజ్యసభకు చేరటంతో అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ..వెంకయ్య నాయుడు బిల్లులో సవరణలు ప్రతిపాదించారు.

అయితే, సవరణలు ఆమోదిస్తే తిరిగి బిల్లు లోక్ సభకు వెళ్లాల్సి ఉంటుందని..అక్కడ ఇక ఆమోదం పొందే అవకాశమే లేదని సుష్మా స్వరాజ్ అభ్యర్దించటంతో సవరణలు ఉప సంహరించుకున్నారు. ఆ తరువాత హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్య నాయుడు తో కలిసి గట్టిగా డిమాండ్ చేసారు. ప్రకటన చేస్తేనే తాము బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేసారు. దీంతో..నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభ సాక్షిగా ప్రకటన చేసారు. అయితే, ఆ తరువాత అరుణ్ జైట్లీ.. వెంకయ్య నాయుడు ఇద్దరూ కేంద్ర మంత్రివర్గంలో మంత్రులయ్యారు. కానీ, హోదా హామీ మాత్రం అమలు కాలేదు.

విభజన సమయంలో అరుణ్ జైట్లీ..

విభజన సమయంలో అరుణ్ జైట్లీ..

రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ కేంద్రం ప్రతిపాదించిన విభజన బిల్లు మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అనేక సవరణలు ప్రతిపాదించారు. హోదా మీద ప్రకటన చేసే వరకూ ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో కొన్ని సవరణలను ప్రవేశ పెట్టారు. ఏపీకి రెవిన్యూ గ్యాప్ ను భర్తీ చేయాలని..అదే విధంగా ఆర్ధికంగా నిలబడే వరకూ రెవిన్యూ గ్రాంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. హోదా మీద బిల్లులో చేర్చాలని పట్టు బట్టినా..సమయం లేకపోవటంతో నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభ సాక్షిగా ప్రకటన చేసారు. దీంతో..బిల్లు ఆమోదించారు. లోక్ సభలో ఏకపక్షంగా ఆమోదం పొందిన విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వ వచ్చి..హామీ దక్కిందంటే దానికి కారణం బీజేపీ అంటూ ఆ పార్టీ నేతలు పలు మార్లు చెప్పుకున్నారు. అరుణ్ జైట్లీ ఆ తరువాత మోదీ కేబినెట్ లో ఆర్దిక మంత్రి అయ్యారు. ఏపీకి సంబంధించిన రెవిన్యూ గ్యాప్ భర్తీ .. వెనుక బడిన జిల్లాల డెవలప్ మెంట్ కోసం నిధులు.. పోలవరం నిధుల రీ యంబర్స్ మెంట్ వంటి వాటి పైన సమహకరించారు. పోలవరం నిధులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు నాటి ఇరిగేషన్ మంత్రి ఉమా భారతిని ఒప్పించి ప్రత్యేకంగా నిధులు వచ్చేలా ఒప్పందం చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఏపీకి రావాల్సిన నిధుల గురించి జైట్లీ అనేక దఫాలు సమావేశమయ్యారు.

<strong>అరుణ్‌జైట్లీ మృతి..! సంతాపం తెలిపిన కేసీఆర్, జగన్ తో పాటు ప్రముఖుల నేతలు..!! </strong>అరుణ్‌జైట్లీ మృతి..! సంతాపం తెలిపిన కేసీఆర్, జగన్ తో పాటు ప్రముఖుల నేతలు..!!

అమరావతిలో ఆర్దిక సిటీ ప్రారంభం..

అమరావతిలో ఆర్దిక సిటీ ప్రారంభం..

2014లో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన కేబినెట్ లో అరుణ్ జైట్లీ ఆర్దిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా విషయాన్ని డిమాండ్ చేసిన అరుణ్ జైట్లీయే ఆ తరువాత ఆర్దిక సంఘం కారణంగా తాము హోదా ఇవ్వలేమని స్పష్టం చేసారు. అదే సమయంలో హోదా పేరుతో ఇచ్చే ప్రయోజనాలు అన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి చంద్రబాబు అంగీకరించటం..ఈ మేరకు జైట్లీ తో ఒప్పందం చేసుకున్నారు. దీని పైన రాజకీయంగా రగడ మొదలైది. ఇది కొనసాగుతుండగానే ఏపీ రాజధాని అమరావతిలో పైనాన్స్ సిటీ శంకుస్థాపన కోసం జైట్లీని ఆహ్వానించారు. ఆయన రాజధానిలో పర్యటించి అనేక శంకుస్థాపనలు చేసారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని స్పష్టం చేసారు. అయితే, ఆయన ఆర్దిక మంత్రిగా ఉన్న సమయంలో రాజధాని కోసం కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగింది. ఏపీ ప్రభుత్వం అనేక మార్లు రాజధానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్దించింది.

ప్యాకేజి ప్రతిపాదన..వివాదం

ప్యాకేజి ప్రతిపాదన..వివాదం

హోదా విషయంలో అసలు ఆర్దిక సంఘం అభ్యంతరం చెప్పలేదని..ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం నుండి ఆర్దిక మంత్రి గా ఉన్న సమయంలో పలుమార్లు అభ్యర్దించారు. అయినా.. హోదా సాధ్యం కాదని..ఎస్పీవీ ఖాతా ప్రారంభించాలని జైట్లీ సూచించారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. 2018లో అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదించారు. అందులో ఏపీకి సంబంధించిన అంశాలు ఏవీ ప్రస్తావించ లేదు. దీంతో..అదే రోజు టీడీపీ మంత్రులు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. ఆ తరువాత మొత్తంగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చేసింది. హోదా అంశం మీదనే లోక్ సభ లో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో అనేక విమర్శలు వచ్చినా..జైట్లీ సమాధానం ఇచ్చారు. చివరకు ప్రధాని సమాధానం లో ఏపీకి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ హోదా మాత్రం ఏపీకి దక్కలేదు.

English summary
Arun Jaitley close attachment With AP. As finance minister Jaitley sanctioned fuds as per re organisation act. Jaitley done bhoomi pooja for finance city in Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X