వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధితుడు మోడీ: జైట్లీ, గత మౌనంపై వెంకయ్య ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో దశాబ్దాలుగా కాంగ్రెస్, వామపక్ష మేధావులు సిద్ధాంతపరంగా చేస్తున్న వ్యూహాత్మక దాడి వల్లే దేశంలో అసహనం వంటి పరిస్థితులు తలెత్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు.

పలువురు సాహితీవేత్తలు తమ అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, మత అసహనం వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. పై వర్గాల కుట్రలకు గత పదమూడేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన బాధితుడిగా మారారన్నారు.
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంటే, బిజెపి సిద్ధాంతాలతో వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష మేధావులు కావాలని దశాబ్దాలుగా బిజెపిని సమాచ వ్యతిరేకిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ నేతలు, వామపక్ష భావజాల ఆలోచనాపరులు... బిజెపిపై, ప్రధాని మోడీపై సైద్ధాంతిక అసహనం కనపరుస్తున్నారన్నారు. భారతదేశమంటే అసహన సమాజమన్నట్లుగా చిత్రీకరించడానికి ఒక పథకం ప్రకారం వారు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సాక్షాత్తూ ప్రధాని మోడీయే వీరి అసహనానికి అత్యంత బాధితుడన్నారు. భారతదేశ హితైషులు, ప్రభుత్వ మంచిని కోరుకునే శ్రేయోభిలాషులు ప్రస్తుత వాతావరణాన్ని చెడగొట్టేలా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రకటనల వల్ల విరోధులకు మరో ఆయుధం లభించినట్లవుతుందనీ, అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు.

మోడీ ప్రధానిగా, బిజెపి అధికారంలో ఉండడమనే ఆలోచననే సహించలేనివారు అనేకమంది ఉన్నారని, వీరిలో కాంగ్రెస్‌, వామపక్ష ఆలోచనపరులు, ఉద్యమకారులు ఉన్నారనేది విడిగా చెప్పాల్సిన అవసరం లేదని, అనేక దశాబ్దాలుగా వారంతా బిజెపి పట్ల సైద్ధాంతిక అసహనం కనపరుస్తూ వస్తున్నారన్నారు.

2002 నుంచి వీటివల్ల అత్యంత బాధితుడెవరంటే ప్రధాని మోడీయే అన్నారు. సంస్కరణలతో మోడీ సర్కారుకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వారు ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. మొదటిది- పార్లమెంటును జరగనీయకుండా అడ్డుకోవడం. రెండోది- దేశంలో సామాజిక కలహాలు ఉన్నాయని ఒక పథకం ప్రకారం ప్రచారం చేయడం. భారత దేశమంటే అసహన సమాజమనే భావన నెలకొల్పాలనేది వారి ప్రయత్నమన్నారు.

Arun Jaitley: Narendra Modi has been the worst victim of ideological intolerance

వాస్తవం మాత్రం వేరేగా ఉందని, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నవారు తమ నియంత్రణలోని విశ్వవిద్యాలయాల్లో, విద్యా/ సాంస్కృతిక సంస్థల్లో ఎన్నడూ భిన్నమైన అభిప్రాయ వ్యక్తీకరణకు అనుమతించలేదని, ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని వారు అంగీకరించలేరని జైట్లీ పేర్కొన్నారు.

దాద్రీలో చోటు చేసుకున్న ఘటన అరుదైనది, దురదృష్టకరమైనది, ఖండించదగ్గదన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. భారతదేశం మొదటి నుంచి సహనానికి, ఉదారవాద సమాజానికి ప్రతీక అనీ, మన సాంస్కృతిక విలువలు కలిసిమెలిసి జీవించడాన్ని ప్రబోధిస్తున్నాయన్నారు.

కవ్వింపులకు మన దేశం ఎన్నడూ స్పందించలేదనీ, అసహనాన్ని అనేకమార్లు తిరస్కరించిందన్నారు. రాజకీయంగా పోరాటం చేయలేనివారు ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారన్నారు.

విష ప్రచారం: వెంకయ్య

కారణాలు ఏవైనప్పటికీ ఎన్డీయే పైన విష ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు. అందరినీ ఒకే ఘాటాన కట్టడం సరికాదని, విచ్చిన్న శక్తులను ఏరివేయాలన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

దేశంలో భిన్న మతాలు, భాషలు, విశ్వాసాలకు చెందిన 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, ఖండించదగ్గ ఘటన జరిగితే మనమంతా దానిని ఖండించాల్సిందేనని, కానీ దేశం స్థాయి దిగజార్చడానికి మనం ఎన్నడూ ప్రయత్నించవద్దన్నారు.

దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ పురస్కారాలను వాపసు చేస్తున్న సాహితీవేత్తలు గతంలో అనేక అకృత్యాలు జరిగినప్పుడు ఎందుకు మౌనం వహించారన్నారు. వారు ఇప్పుడు మాత్రమే ఎందుకు నిరసన తెలియజేస్తున్నారని నిలదీశారు.

English summary
Finance Minister Arun Jaitley on Sunday accused the “Congress, Left thinkers and activists” of practising “ideological intolerance” and said that they have not “accepted the idea” of the BJP being in power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X