వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు పద్మవిభూషణ్: పీవీ సింధుకు పద్మభూషణ్, ఏపీ, తెలంగాణ నుంచి వీరికే..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Padma Awards 2020 : Telangana and Andhra Pradesh People Got Padma Honour || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగాల్లో చేసిన సేవలకు గానూ అర్హులైన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 141 మందితో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది.

జైట్లీ, సుష్మాలకు పద్మవిభూషణ్..

జైట్లీ, సుష్మాలకు పద్మవిభూషణ్..

ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్ పురస్కారాలతోపాటు 118 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. జార్జి ఫెర్నాండెస్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, విశ్వేశ్వతీర్థ స్వామీజీలకు మరణాంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. అనిరుధ్ జుగ్‌నౌద్ మిశ్రా(మారిషస్), ఎంసీ మేరీకోమ్(మణిపూర్-క్రీడలు), చెన్నూలాల్ మిశ్రా మిశ్రా(ఉత్తరప్రదేశ్-కళలు)లకు కూడా పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి.

పీవీ సింధుకు పద్మభూషణ్, ఏపీ, తెలంగాణవారికి పద్మలు

పీవీ సింధుకు పద్మభూషణ్, ఏపీ, తెలంగాణవారికి పద్మలు

క్రీడా విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిన్నతల వెంకట్ రెడ్డి(వ్యవసాయంలో చేసిన కృషికి గానూ) , విజయసారథి శ్రీభాష్యం(విద్య, సాహిత్యంలో చేసిన కృషికిగానూ), ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్లగోపాలరావు(కళలు), దలవాయి చలపతిరావు(కళలు)లను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు లభించడం గమనార్హం.

16 మందిని పద్మభూషణ్ పురస్కారం వరించింది..

16 మందిని పద్మభూషణ్ పురస్కారం వరించింది..

ఎం ముంతాజ్ (కేరళ-ఆధ్యాత్మికం)

సయ్యద్ మౌజం అలీ (బంగ్లాదేశ్-ప్రజాసంబంధాలు(మరణాంతరం)
ముజఫర్ హుస్సేన్ బేగ్ (జమ్మూకాశ్మీర్-ప్రజా సంబంధాలు)
అజయ్ చక్రవర్తి (పశ్చిమబెంగాల్-కళలు)
మనోజ్ దాస్ (పుదుచ్చేరి-సాహిత్యం, విద్య)
బాలకృష్ణ దోషి (అర్కిటెక్చర్-గుజరాత్)
కృష్ణమ్మల్ జగన్నాథన్(తమిళనాడు-సామాజిక సేవ)
ఎస్‌సీ జామిర్ (నాగాలాండ్-ప్రజా సంబంధాలు)
అనిల్ ప్రకాశ్ జోషి(ఉత్తరాఖండ్-సామాజిక సేవ)
సేరింగ్ లండల్(లడఖ్-వైద్యం)
ఆనంద్ మహీంద్రా(మహారాష్ట్ర-వాణిజ్యం, పరిశ్రమలు)
పీవీ సింధూ(తెలంగాణ-క్రీడలు)
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్(కేరళ-ప్రజాసంబంధాలు(మరణాంతరం)
మనోహర్ పారికర్(గోవా-ప్రజా సంబంధాలు(మరణాంతరం)
జగదీశ్ సేథ్(అమెరికా-విద్య, సాహిత్యం)
వేణఉ శ్రీనివాసన్ (తమిళనాడు-వాణిజ్యం, పరిశ్రమలు)

English summary
Arun Jaitley, Sushma Swaraj and George Fernandes conferred with Padma Vibhushan award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X