వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిగ్నేష్ మేవానీకి అరుంధతీ రాయ్ భారీ విరాళం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దళిత నేత జిగ్నేష్ మేవానీ ప్రకటించిన మరుసటి రోజు నుంచి అతనికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. వెబ్‌సైట్ ద్వారా ఆయన నిధుల సేకరణ చేపడుతున్నారు.

రూ. 100 నుంచి లక్షల వరకు మేవానీకి విరాళాలు వస్తుండటం గమనార్హం. గత పదిరోజుల్లోనే ఆయన రూ.9లక్షల మేర విరాళాలు సేకరించారు. రచయిత అరుంధతీ రాయ్ కూడా రూ. 3లక్షలను మేవానీ నిధికి విరాళంగా ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మేవానీ.. అరుంధతీ రాయ్‌కి ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Arundhati Roy Contributes Rs 3 Lakh to Dalit Leader Jignesh Mevani's Campaign

తాను కుల వివక్షపై పోరాటం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనకు తోచినంత విరాళం అందజేయాలని మేవానీ ప్రజలను కోరారు. సమాజ హితం కోసమే ఈ డబ్బును ఉపయోగిస్తానని మేవానీ చెప్పారు. కాగా, మేవానీపై తాము అభ్యర్థిని నిలబెట్టబోమని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. వేదగామ్ నుంచి మేవానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

నామినేషన్ వేసిన మరుసటి రోజే నాన్ బెయిలబుల్ వారెంట్

నామినేషన్‌ దఖాలు చేసే పనిలో బిజీగా ఉన్నందున జిగ్నేశ్‌ రాలేకపోయారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది షంషాద్ పఠాన్‌ విన్నవించారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. వైబ్రెంట్‌ గుజరాత్‌ సదస్సుకు వ్యతిరేకంగా జనవరి 11న నిర్వహించిన రైల్‌ రోకో ఆందోళనలో భాగంగా అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను జిగ్నేశ్‌, ఆయన మద్దతుదారులు నిలిపివేశారు. ఈ కేసులో 40 మంది కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.

English summary
Just days after announcing that he was going to fight as an independent candidate in the upcoming Gujarat elections, Dalit leader Jignesh Mevani has got a shot in the arm with his new way of crowdfunding his campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X