వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాయిదారులకు కూడ ఉచిత విద్యుత్ : సీఎం కేజ్రీవాల్ మరో ఆఫర్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఢిల్లీ సర్కారు ఫ్రీ మానియాను తీసుకువస్తోంది. ఇప్పటికే 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా ఇళ్లలో ఉండే కిరాయిదారులకు కూడ ఈ పథకాన్ని వర్తింప చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ 200 యూనిట్లవరకు విద్యుత్‌ను వినియోగించే వారికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు.

ఇదివరకే స్వంత ఇళ్లు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. వారిలాగానే కిరాయిదారులకు కూడ మరో పథకాన్ని ప్రకటించారు.అద్దె ఇళ్లలో నివసించేవారు తమ ప్రాంతానికి చెందిన విద్యుత్‌ సరఫరాదారుని ద్వారా ఈ మీటర్లను పొందవచ్చాన్నారు. ఈ పథకాన్ని పొందాలంటే అద్దె ఇళ్లలో నివసించేవారు వారి చిరునామా పత్రం, అద్దె ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇంటి యజమానికి ఎటువంటి అభ్యంతరం లేనట్లు ఒక పత్రాన్ని ఇవ్వాల్సింటుందన్నారు.ముందుగా ఈ పథకం వినియోగించేకునేవారు రూ.3000 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సివుంటుంది.

Arvind Kejriwal announced that electricity power subsidy will be extended for tenants

కాగ గతంలో కూడ నీటీ బిల్లులను కూడ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్టు తెలిపారు. మరోవైపు మహిళలకు మెట్రోతోపాటు బస్సుల్లో కూ ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించడంతోపాటు కోర్టుకు వెళ్లడంతో బ్రేక్ పడింది.

English summary
chief minister Arvind Kejriwal today announced that electricity power subsidy will be extended for tenants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X