వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం: పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు రాక

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కుమార స్వామి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి తెలుగు ముఖ్య‌మంత్రులు

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా జెడి(ఎస్) నేత కుమారస్వామి బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరుకానున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హజరుకావాల్సిందిగా జెడి(ఎస్) అధినేత , మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవేగౌడ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ హజరుకానున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి.

Arvind Kejriwal to attend HD Kumaraswamys oath-taking ceremony

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హజరుకానున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్ళే విషయమై చంద్రబాబునాయుడు మంత్రులతో చర్చించగా, వారంతా ఏకగ్రీవంగా బెంగుళూరు వెళ్ళాలని సూచించారని సమాచారం.

మరోవైపు తెలంగాణ సీఎం కెసిఆర్ కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడ కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హజరు కానున్నట్టు ఆమె ప్రకటించారు.

బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడ కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హజరుకానున్నారని సమాచారం. ఎన్నికల్లో బిఎస్పీ, జెడి(ఎస్)తో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బిఎష్పీ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకొంది. మరోవైపు డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ కూడ కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హజరయ్యే అవకాశం కూడ ఉందని సమాచారం.

English summary
Delhi chief minister Arvind Kejriwal, BSP chief Mayawati and DMK working president MK Stalin have given their nod to attend JD(S) leader HD Kumaraswamy's oath-taking ceremony on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X