వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్తీ మే సవాల్: 24 గంటల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించండి: అరవింద్ కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

మరో నాలుగురోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండగా మాటలయుద్దం తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించిన కేజ్రీవాల్.. బీజేపీపై విమర్శలకు మరింత పదునుపెట్టారు. సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ.. కబుర్లు చెప్తుందని విమర్శించారు. దమ్ముంటే బుధవారం లోగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Recommended Video

Delhi Assembly Elections Opinion Poll : AAP to Win 54-60 out of 70 seats, BJP May Bag 10-14

కేజ్రీవాల్ డెడ్‌లైన్..

బుధవారం మధ్యాహ్నం 1 గంటలోపు బీజేపీ తమ సీఎం అభ్యర్థని ప్రకటించాలని కోరారు. క్యాండెట్ ఎవరో చెబితో సదరు నేతతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. తన సవాల్‌ను బీజేపీ స్వీకరించని పక్షంలో తానే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అంతేకాదు ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియజేయాలని కోరాలని కేజ్రీవాల్ సూచించారు.

యోగి ఫైర్

యోగి ఫైర్

మరోవైపు కేజ్రీవాల్ కామెంట్లపై అంతుకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిచారు. ఢిల్లీ వీధుల్లో తనను ప్రచారం చేయనీయకుండా అడ్డుకొనేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎందుకంటే షహీన్ బాగ్ అల్లర్లకు కారణమెవరో అందిరికీ తెలుసు అని మాట్లాడారు. సీఏఏ కాదు, కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, వివాదాస్పద భూమి అయోధ్య స్థలంపై కూడా వారు ఇదే అభిప్రాయంతో ఉన్నారని గుర్తుచేశారు.

ఆప్‌కు అనుకూలం..?

ఆప్‌కు అనుకూలం..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి స్టేజీకి చేరిన టైమ్స్ నో పోల్ సర్వే వివరాలను వెల్లడించింది. సర్వే ప్రకారం ఆప్ 54 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నది. బీజేపీ 10-14, కాంగ్రెస్ 2 సీట్లు గెలవబోతుందని తెలియజేసింది. టైమ్స్ నౌ సర్వే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరింత బూస్ట్‌నిచ్చింది.

English summary
Delhi CM Arvind Kejriwal has challenged the BJP to announce its chief ministerial candidate by 1 pm on Wednesday and said he is ready for a public debate with that candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X