వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కేజ్రీవాల్ అసలా మాటే అనలేదు"

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పాక్ పై భారత్ చేసిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అటు మీడియాలోను ఇటు జనంలోను ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కేజ్రీపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

కాగా, కేజ్రీవాల్ అసలు అలాంటి వ్యాఖ్యలే చేయలేదని చెబుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా ఈ వివాదంపై స్పందించిన ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా కేజ్రీపై వస్తోన్న ఆరోపణలను ఖండించారు. గోవాలో మీడియాతో మాట్లాడిన సందర్బంగా.. ఈ విషయాన్ని ప్రస్తావించిన సిసోడియా 'ఆధారాలు' అన్న పదం అసలు కేజ్రీవాల్ ఉపయోగించలేదని తెలిపారు.

Arvind Kejriwal Never Asked Said 'Proof' On Surgical Strikes: Manish Sisodia

అంతేకాదు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ప్రధాని మోడీని అభినందిస్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా కేజ్రీవాల్ విడుదల చేశారని చెప్పారు. దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించిన పోరాడిన సైనికులను ఈ సందర్బంగా ఆయన కొనియాడారు. ఇండియన్ ఆర్మీ ఎంతో ధైర్యంగా పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు.

English summary
Delhi Deputy Chief Minister Manish Sisodia today alleged that BJP and the media attributed words to Chief Arvind Kejriwal which he never uttered on the issue of the surgical strikes by the army across the Line of Control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X