వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020: ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి: కేజ్రీవాల్ ఎన్నికల నినాదం..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశానికి రాజధానిగా ఉన్నప్పటికీ.. న్యూఢిల్లీకి బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి ఢిల్లీవాసులపై సవతితల్లి ప్రేమను ప్రదర్శించిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఢిల్లీ బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు..

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ వాసులు బీజేపీకి ఏ కారణంతో ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే బీజేపీ ఢిల్లీ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని, ఇక ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందని, తన ఎన్నికల హామీలను నెరవేర్చగలదా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Arvind Kejriwal questioned why people should vote for BJP

ఎన్నికల ముంగిట్లో ఉన్నందున.. వాటిని దృష్టిలో పెట్టుకుని అయినా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై వరాల జల్లు కురిపిస్తుందని సగటు ఢిల్లీ పౌరుడు ఆశించారని అన్నారు. ఢిల్లీ సంక్షేమానికి కొద్దో, గొప్పో నిధులను కేటాయిస్తుందని భావించారని చెప్పారు. వారి ఆశలను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు. ఢిల్లీవాసుల పట్ల బీజేపీకి ఎంత ప్రేమ ఉందనేది ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందని విమర్శించారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుతుందని భావించామని, చివరికి మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. ఇదే అంశాన్ని తాము తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా జనంలోకి తీసుకెళ్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి.. ? అనే నినాదంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు. ఓడిపోతామని తెలిసే.. ఢిల్లీకి నిధులను మంజూరు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal questioned why people should vote for BJP when it has disappointed the national capital just before the state elections. "Delhi had high expectations from the Budget. But once again Delhiites received stepmotherly treatment, he says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X