వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ ఎందుకని ఏ శాఖను తీసుకోలేదు.. కారణమేంటో స్వయంగా వెల్లడించిన సీఎం..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో లాగే ఈసారి కూడా ఏ మంత్రిత్వ శాఖను తీసుకోలేదు. అన్ని శాఖలను మంత్రులకే కేటాయించారు. ఆ రకంగా ఢిల్లీ కేబినెట్‌లో ఏ పోర్ట్‌ఫోలియో లేని మంత్రి కేజ్రీవాల్ మాత్రమే. ఢిల్లీ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేందుకే ఏ శాఖను తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని.. ఢిల్లీ ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యతను అప్పగించారని.. దాన్ని సరిగా నిర్వర్తించేందుకే మరే శాఖను తీసుకోలేదని తెలిపారు. చేతిలో మరో శాఖ ఉంటే.. దానిపై ఎక్కువ దృష్టి సారించాల్సి వస్తుందని.. అలా కాకుంటే,అన్ని శాఖలను పర్యవేక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు.

కేజ్రీవాల్ క్యాబినెట్‌లో నో ఉమెన్, మహిళలకు అవకాశం ఇవ్వని కుమారుడు, సాధికారత అంటూ..కేజ్రీవాల్ క్యాబినెట్‌లో నో ఉమెన్, మహిళలకు అవకాశం ఇవ్వని కుమారుడు, సాధికారత అంటూ..

కేజ్రీవాల్ కేబినెట్‌లో ఆప్‌ ఎమ్మెల్యేలు మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌, గోపాల్‌ రాయ్‌, కైలాష్‌ గహ్లోత్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, రాజేంద్రగౌతమ్‌లు మంత్రులుగా కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే కేబినెట్‌లో మహిళా మంత్రికి అవకాశం ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చేదిగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరుపున మొత్తం 8 మంది మహిళలు విజయం సాధించగా.. ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఎన్నికల్లో మొత్తం 9 మంది మహిళలను ఆప్ బరిలో దించగా.. సరితా సింగ్ అనే ఒకే ఒక్క మహిళా అభ్యర్థి మాత్రమే ఓడిపోయారు. మిగతా అభ్యర్థులు అతిషి మార్లెనా,రాఖీ బిర్లా,రాజ్ కుమారి ధిల్లాన్,ప్రీతి తోమర్,ధన్వంతి చందేలా,పర్మిలా టోకస్,భావన గౌర్,బందన కుమారి గెలుపొందారు.

Recommended Video

Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16 | Oneindia Telugu
arvind kejriwal reaction over No ministry yet again

మహిళా ఎమ్మెల్యేల్లో అతిషి మార్లెనా గతంలో మనీష్ సిసోడియాకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ విద్యా వ్యవస్థకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారు. తాజా కేబినెట్‌లో ఆమెకు చోటు దక్కుతుందని భావించినప్పటికీ భంగపాటు తప్పలేదు. ఇక మరో మహిళా ఎమ్మెల్యే రాఖీ బిర్లాకు కూడా మంత్రి పదవి దక్కవచ్చునన్న ఊహాగానాలు వినిపించాయి. ఆప్ తొలిసారి అధికారంలోకి వచ్చాక.. 2013-2014 కాలంలోరాఖీ బిర్లా కొంతకాలం మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. దీంతో తాజా కేబినెట్‌‌లో చోటు దక్కుతుందనుకున్న నిరాశ తప్పలేదు. తాజా ఎన్నికల్లో మంగొల్‌పురి నియోజకవర్గం నుంచి ఆమె 58శాతం ఓటు షేర్‌తో,74వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal, who was elected to power for the third consecutive term, has not taken charge of any ministry yet again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X