వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ దంగల్: బాద్షా మళ్లీ కేజ్రీవాలే.. సర్వేలు చెబుతున్న జోస్యం, హ్యాట్రిక్ దిశగా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. సోమవారం ఢిల్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పార్టీలు జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎక్కడా ఈసీ నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో ముక్కోణపు పోటీ జరగనుంది. ఓ వైపు అధికారిక ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉండగా మరోవైపు ఢిల్లీలో వికసించేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీని గెలిచి పూర్వవైభవం చాటాలని భావిస్తోంది. మొత్తానికి ట్రయాంగ్యులర్ ఫైట్‌ ఢిల్లీలో నెలకొనబోతోంది. అయితే ఢిల్లీ వాసులు ఎవరికి పట్టం కడుతారు..? సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి..? ప్రస్తుతం సర్వేలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్

సర్వేలు ఏం చెబుతున్నాయి..?

సర్వేలు ఏం చెబుతున్నాయి..?


ఢిల్లీ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. అయితే ఓటర్ల నాడి ప్రస్తుతానికి ఎలా ఉందనే దానిపై సర్వేలు ప్రారంభమయ్యాయి. అధికారంలో ఉన్న కేజ్రీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందా అనేదానిపై చర్చ నడుస్తోంది. కొన్నిచోట్ల కేజ్రీవాల్‌కే అనుకూలంగా ఢిల్లీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ ఢిల్లీ వాసుల పల్స్ ఎలాగుందో ఐయాన్స్ సీఓటర్ సంస్థలు సంయుక్తంగా కలిసి సర్వే నిర్వహించాయి. ప్రచారం జరుగుతున్నట్లుగానే కేజ్రీవాల్ క్రేజీ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని తమ సర్వే ద్వారా వెల్లడైనట్లు సీఓటర్ సంస్థ తెలిపింది.

ఢిల్లీ కింగ్ కేజ్రీవాలేనా..?

ఢిల్లీ కింగ్ కేజ్రీవాలేనా..?

ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీకి షెహన్‌షా అని పేర్కొంది. 70 సీట్లకుగాను ఆమ్‌ ఆద్మీ పార్టీకి 59 సీట్లు దక్కుతాయని సర్వే స్పష్టం చేసింది. బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని చెప్పిన సీ ఓటర్ సర్వే... చాలా తక్కువ స్థానాలతో అంటే 8 సీట్లతో సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగై మూడో సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పింది. ఇక సీట్ల ప్రొజెక్షన్ చూస్తే ఆప్‌కు 64 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ప్రొజెక్షన్‌ చూస్తే 3 నుంచి 13 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్‌కు 0 నుంచి 6 సీట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లు సీఓటర్ సర్వే వెల్లడించింది.

 ఆమ్‌ ఆద్మీ పార్టీకి 53శాతం ఓటు షేరు

ఆమ్‌ ఆద్మీ పార్టీకి 53శాతం ఓటు షేరు

ఒక్క ఢిల్లీ నగరంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీకి 26 సీట్లు వస్తాయని సీఓటర్ జోస్యం చెప్పింది. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఆప్‌కు 17 సీట్లు వరకు రావొచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 16 సీట్లు వరకు వస్తాయని చెబుతోంది. ఇక ఓటు షేరు శాతం చూస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీకి 53శాతం ఓటు షేరు దక్కనుండగా, బీజేపీకి 26శాతం కాంగ్రెస్‌కు 5శాతం ఓటు షేరు దక్కనుంది. జనవరిలో నిర్వహించని ఈ సర్వేలో మొత్తం 13,076 శాంపిల్స్ ‌ను తీసుకున్నట్లు సీఓటర్ సర్వే వెల్లడించింది.

బెస్ట్ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌కే ఓట్లు

బెస్ట్ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌కే ఓట్లు


ఢిల్లీ సీఎంగా ఎవరైతే బాగుంటారన్న ప్రశ్నకు కేజ్రీవాల్ పేరు ప్రథమంగా వినిపిస్తోంది. కేజ్రీవాల్‌ సీఎంగా 70శాతం మంది ఆమోదించగా...బీజేపీ నేత డాక్టర్ హర్షవర్థన్‌కు 11శాతం మంది ఆమోదం తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా అధికారంలో ఉండగా... ఢిల్లీ నగర సమస్యలను ఒక్క ఆప్‌ సర్కార్ మాత్రమే పరిష్కరించగలదని నమ్ముతున్న వారి శాతం 32.7శాతంగా ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక

English summary
The ruling Aam Aadmi Party (AAP) is all set sweep back to power in the Delhi Assembly elections, according to IANS-CVoter Delhi poll tracker
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X