వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం, కాపాడుకునేందుకు ఏమైనా చేసుకో: కేజ్రీవాల్ ఆఫీస్‌కు బెదిరింపు మెయిల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుకు సెక్యూరిటీని కల్పించారు. ఈ మెయిల్ ద్వారా ఆమెను కిడ్నాప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు భద్రతను పెంచారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ కూతురును అపహరిస్తామని ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు శనివారం తెలిపారు. జనవరి తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఈ ఈ మెయిల్‌ గురించి ఢిల్లీ పోలీస్‌ కమిషనరు అమూల్య పట్నాయక్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

వెంటనే స్పందించిన అమూల్య పట్నాయక్‌.. కేజ్రీవాల్‌ కూతురు రక్షణకు ప్రత్యేకంగా ఓ పోలీసు అధికారిని నియమించారని చెప్పారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని సైబర్‌ సెల్ పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

 Arvind Kejriwals Daughter Gets Security After Email Threat

'మీ కూతురును కిడ్నాప్ చేస్తాం. ఆమెను కాపాడుకునేందుకు ఏం చేస్తావో చేసుకో' అని ఆ బెదిరింపు ఈ మెయిల్‌లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీనిపై సైబర్ సెల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

కేజ్రీవాల్ సతీమణి సునితా. వీరికి ఇద్దరు పిల్లలు. హర్షిత కేజ్రీవాల్ పెద్ద అమ్మాయి. పులకిత్ అబ్బాయి. సాధారణంగా కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు రాజకీయాలకు, అన్నింటికి దూరంగా ఉంటారు. 2014లో హర్షిత కేజ్రీవాల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎంట్రెన్స్ టెస్ట్‌లో పాసైనప్పుడు ఆమె పేరు మీడియాలోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఆమె ఇంజినీరింగ్ చేశారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal, involved in multiple security scares, has received an email from a person that threatens his 23 year old daughter will be kidnapped.After the Aam Aadmi Party leader lodged an official complaint, an investigation was launched. The identity of the person, who sent the email is not known yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X