మరో 14రోజులు జైల్లో కేజ్రీ, కోర్టులో స్వయంగా వాదనలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ న్యాయస్థానం మరో 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతర విచారణను కోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. బిజెపి మాజీ అధ్యక్షుడు నేత నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో రెండు రోజుల కిందట కేజ్రీవాల్ కోర్టు ముందుకు హాజరయ్యారు.
కోర్టుకు బెయిల్ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో అదుపులోకి తీసుకోవాలి ఆదేశించింది. కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. దాంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీహార్ జైల్లో ఉంచారు.

శుక్రవారం పోలీసులు తిరిగి కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. పూచీకత్తు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో కోర్టు ఆయనకు మరో 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించి, కేసును వాయిదా వేసింది.
కాగా, కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ హాజరవుతున్న నేపథ్యంలో ఎఎపి మద్దతుదారులు, నాయకులతో కోర్టు కిటకిటలాడింది. కేజ్రీవాల్ భార్య సునీత కూడా కోర్టుకు వచ్చారు. అయితే వారందరినీ న్యాయమూర్తి బయటకు పంపించారు.












Click it and Unblock the Notifications