వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌పై దుండగుడి ���ాడి : ప్రచారం చేస్తుండగా ఘటన, తొమ్మిదోసారి అటాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మోతినగర్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ప్రచార రథంపైకి ఎక్కు అసభ్య పదజాలంతో దూషిస్తూ .. చెంపపై కొట్టాడు.

రెప్పపాటులో అటాక్ ..

రెప్పపాటులో అటాక్ ..

ఒక్కసారిగా జరిగిన దాడితో కేజ్రీవాల్ అప్రమత్తమయ్యాడు. తన ప్రచార రథంలో వెనక్కి జరిగి దుండగుడి మరోసారి కొట్టకుండా తప్పించుకున్నాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఆప్ కార్యకర్తల దాడి చేయడంతో .. వారించి పోలీసులకు అప్పగించారు.

తొమ్మిదోసారి దాడి ..

తొమ్మిదోసారి దాడి ..

ఇదివరకు జరిగి సభలు, సమావేశాలు, స్టేడియంలో కూడా కేజ్రీవాల్ పై దాడి జరిగింది. శనివారంతో కలిపితే దాడుల సంఖ్య 9కి చేరింది. ప్రచారం చేస్తుండగా యువత అటాక్ చేశారు. గతంలో ఓసారి స్టేడియంలో ఉండగా ఇంక్ చల్లాడు ఓ యువకుడు.

 భద్రతాలోపం ...

భద్రతాలోపం ...

ఇదివరకు 8 సార్లు దాడి జరిగినా ... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సరైన చర్యలు తీసుకోలేదని ఆప్ ఆరోపిస్తోంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం .. ఇక్కడ విధాన నిర్ణయాలు, భద్రతాపరమైన అంశాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఇదివరకు జరిగినా దాడుల నేపథ్యంలో పటిష్ట భద్రత కల్పించాల్సింది పోయి .. పట్టనట్టు వ్యవహరించారనే ఆరోపిస్తున్నారు.

ఇదివరకు హార్థిక్ పై కూడా ...

ఇదివరకు హార్థిక్ పై కూడా ...

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారం పర్వంలోనూ నేతలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హార్థిక్ పటేరెల్ పై దాడి జరగగా ... తాజాగా కేజ్రీవాల్ దుండగుడు అటాక్ కు యత్నించాడు. పాటిదార్ ఉద్యమనేత హార్థిక్ గుజరాత్ లో బంద్ కు పిలుపునివ్వడంతో తమ కుటుంబం ఇబ్బందికి గురైందని ... తన కుమారుడి ఆరోగ్యం బాగోలేకుంటే కనీసం మెడికల్ షాపు కూడా తెరవని పరిస్థితి అని దాడిచేసిన వ్యక్తి తెలిపారు. హార్థిక్ తో ఇబ్బంది పడ్డామని .. అందుకే దాడిచేశానని ఆయన మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
"Delhi CM Arvind Kejriwal got attacked during the roadshow. We condemned this cowardly act. This opposition sponsored attack cannot stop the Aam Aadmi in Delhi," says AAP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X