వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎలా ఉంది..?

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైన ప్రజలకు సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టినప్పుడు వాటి ఫలితాలు ఆశిస్తారు. పథకాలు సక్రమంగా అమలు జరగడంతో పాటు వాటి గురించి ప్రజలు ఏవిధంగా అలోచిస్తున్నారో తెలుసుకోవాలని ఆకాంక్ష ప్రభుత్వంలోని నాయకునిలో ఉంటుంది. అయితే పథకాల ఫలితాలను తెలుసుకోవడంలో ఇతర మార్గాల ద్వార ఆరా తీస్తారు. మరికొంత మంది నేరుగా ప్రజలతో మమేకం అయ్యో నాయకులు కూడ లేకపోలేదు. ఈకోవకే చెందిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, ప్రత్యక్షంగా పథకాల అమలు పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు.

బస్సుల్లో ప్రయాణించిన సీఎం కేజ్రీవాల్

బస్సుల్లో ప్రయాణించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకాన్ని మంగళవారం నుండి అమలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ మహిళలు బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే స్కీంకు రూపకల్పన చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ , ఫలితాలను తెలుసుకునేందుకు తానే స్వయంగా ఢిల్లీ బస్సుల్లో ప్రయాణించారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడిన సీఎం, ఉచితంగా ప్రయాణంపై వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

మహిళలు వెరీ హ్యాపీ .. కేజ్రీవాల్

మహిళలు వెరీ హ్యాపీ .. కేజ్రీవాల్

ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. తాను కొన్ని బస్సుల్లో ప్రయాణించానని, ఉచిత ప్రయాణం ద్వార మహిళలు షాపింగ్‌కు వెళ్లడంతో పాటు ఉద్యోగాలకు వెళ్లెవారు ఉన్నారని చెప్పారు. కాగా ప్రతిరోజు వైద్యం కోసం వెళ్లే మహిళలు కూడ బస్సులో ఉన్నారని తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉండేదని ఈ రోజు నుండి ఢిల్లీ మహిళలు వీఐపీలుగా మారారని అన్నారు. ఇక ఈ ఉచిత ప్రయాణాలు మహిళల జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పొదుపు సోమ్ముతో అభివృద్ది

పొదుపు సోమ్ముతో అభివృద్ది

అయితే మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాడని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో వారి ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఉచిత ప్రయాణం స్కీంలో వ్యతిరేకించడానికి ఏ కారణం లేదని అన్నారు. గతంలో కూడ ఢిల్లీ ప్రజలకు ఉచిత విద్యుత్ ప్రకటించానని గుర్తు చేశారు. ఇదంతా ప్రభుత్వం సోమ్మును దుర్వినియోగం కాకుండా... పొదుపు చేసిన డబ్బు అని చెప్పారు. గత ప్రభుత్వాలు చేసిన అవినీతిని అరికట్టి ఆ డబ్బును ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నానని తెలిపారు.

పోటాపోటి ఉచితాలు

పోటాపోటి ఉచితాలు

ఢిల్లీ ఎన్నికలు రానున్న మూడు నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజలకు దగ్గరయ్యోందుకు సీఎం కేజ్రీవాల్ ఉచిత మానియాను ప్రజల్లోకి విసిరారు. ఇదివరకే 200 యూనిట్లు వాడుకునే విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. కాగా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని గత ఆగస్టు 15న ప్రకటించారు. ఇక మెట్రో రైల్లో కూడ మహిళలకు ఉచిత ప్రయాణించినా దాని అమలుకు కేంద్రం అడ్డంకి చెప్పింది. దీంతో ప్రస్తుతం బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించి అమలు చేస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడ సుమారు 40 లక్షల మంది లబ్దిపోందే విధంగా 1800 కాలనీల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యూలరైజ్ చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణంయ తీసుకుంది. దీంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చేపడుతున్న ఉచిత పథకాలు ఏమేరకు, ఓట్లు సాధించిపెడతాయో వేచి చూడాలి.

English summary
Women travelers in Delhi are very happy with the free bus ride scheme, Chief Minister Arvind Kejriwal said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X