వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్దిక సలహాదారుగా అరవింద్, పర్యాటకకు మయారామ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్దిక సలహాదారుగా ప్రవాస భారతీయుడు అరవింద్ సుబ్రమణియన్ నియమితులయ్యారు. అరవింద్ సుబ్రమణియన్ నియమిస్తూ కేంద్ర ఆర్దిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్దికాభివృద్ది, పెట్టుబడులు, భారతీయులందరికీ ఆర్దిక ఫలాలు అందేలా చర్యలు తీసుకోవడంపై కృషి చేస్తానని కొత్తగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ మయారామ్ పర్యాటక శాఖకు బదిలీ చేసింది. ఫైనాన్స్ విభాగంలో నలుగురు కార్యదర్శులలో అత్యంత సీనియర్ అధికారి అయిన మాయారాంను పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయన స్దానంలో రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మెహరిషి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Arvind Subramanian

ఈ మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానిగా మోడీ పదవి చేపట్టిన తర్వాత అత్యున్నత స్థాయి అధికారి బదిలీ ఇదే. ఇప్పటిదాకా ఆర్థిక శాఖ కార్యదర్శిగానే కాక ఎకనమిక్ అఫైర్స్ కార్యదర్శిగానూ పనిచేసిన మయారామ్‌ను యూపీఏ ప్రభుత్వం ఆ పదవిలో నియమించింది.

English summary
US-based economist Arvind Subramanian has been selected as India's chief economic adviser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X