వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేనిఫెస్టోలోనే నాడు స్ప‌ష్టం చేసిన బీజేపీ: నేడు ఆచ‌ర‌ణ‌లో 370 ర‌ద్దు

|
Google Oneindia TeluguNews

ఆర్టిక‌ల్ 370కు నాటి సంగ్ ప‌రివార్ నుండి నేటీ బీజేపీ నేత‌ల వ‌ర‌కు అంద‌రూ తొలి నుంది వ్య‌తిరేక‌మే. జమ్ము కాశ్మీర్ లో పీడీపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో మాత్ర‌మే ఆర్టిక‌ల్ 370 కొన‌సాగింపు పైన కొన్ని సంద‌ర్బాల్లో బీజేపీ నేత‌లు అనుకూల వ్యాఖ్య‌లు చేసారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో బీజేపీ తాము అధికారంలోకి వ‌స్తే ఆర్టిక ల్ 370, 35ఏ ర‌ద్దు పైన స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చింది. అదే విధంగా కాశ్మీర్‌లో శాంతియుత వాతావ‌ర‌ణం కోసం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చింది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా పూర్తి ప‌రిష్కారం చూపించాల‌నే ల‌క్ష్యంలో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు ఉన్న మెజార్టీని దృష్టిలో పెట్టుకొని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తొలి నుండి ప‌క్కా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ ఆశ‌యం నెర‌వేర్చిన మోదీ..

శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ ఆశ‌యం నెర‌వేర్చిన మోదీ..

జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న ప‌రిస్థితుల పైన నాటి నుండి సంఘ్ ప‌రివార్ త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేయాల‌ని ఎప్ప‌టి నుండో వారు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ దీని పైన స్ప‌ష్టంగా త‌న అభిప్రాయం చెప్పారు. ఆయ‌న మ‌ర‌ణించే వ‌ర‌కూ దేశం మొత్తం ఒకే జెండా కొంద..అదే విధంగా ఒకే చ‌ట్టం ఉండాల‌నేది శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీ నిర్ధిష్ట‌మైన అభిప్రాయం. దీంతో..నాటి నుండి బీజేపీ అధికారంలో ఉన్నా..ఎప్పుడూ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకొనే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు పూర్తి స్థాయి మెజార్టీ రావ‌టంతో పాటుగా జ‌మ్ము కాశ్మీర్ స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపే క్ర‌మంలో భాగంగా..ప‌క్కా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది. త‌మ పార్టీ వ్య‌వ‌స్థాపక అధ్య‌క్ష‌డి ఆశ‌యాన్ని నెర‌వేర్చే క్ర‌మంలో భాగంగా ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

బీజేపీ మేనిఫెస్టో హామీ అమ‌లు దిశ‌గా...

బీజేపీ మేనిఫెస్టో హామీ అమ‌లు దిశ‌గా...

ఇదే ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ త‌మ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పైన స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిం ది. ఈ ఆర్టిక‌ల్ ద్వారా కేంద్రం జోక్యం చేసుకోలేని ప‌రిస్థితి అక్క‌డ నెల‌కొని ఉంద‌ని బీజేపీ నేత‌లు ఎన్నిక‌ల స‌మ‌యం లో ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. జ‌మ్ము కాశ్మీర్ స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ను రద్దు చేస్తామ‌ని ఎన్నిక‌ల మేని ఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ రాష్ట్రం అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ చ‌ట్టం కారణంగా ఎవ‌రూ అక్క‌డ అభివృద్దిలో భాగ‌స్వాములు కాలేక‌పోయార‌నేది బీజేపీ నేత‌ల వాద‌న‌. ఈ చట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన స‌మ‌యం నుండి శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌టం మిన‌హా.. అభివృద్దికి సాధ్య‌ప‌డం లేద‌ని బీజేపీ నేత‌లు వాదిస్తున్నా రు. ఆ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెబుతూ తాము అధికారంలోకి రాగానే ర‌ద్దు నిర్ణ‌యం తీసుకుంటామ ని హామీ ఇచ్చారు. ఇప్పుడు పూర్తి మెజార్టీ రావ‌టంతో ప్ర‌ధాని మోదీ వ్యూహాత్మ‌క అడుగుల‌తో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసు కున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెర‌వేర్చారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పైన కాశ్మీర్ పండిట్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 మోదీ-షా ద్వ‌యం ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా..

మోదీ-షా ద్వ‌యం ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా..

పూర్తి మెజార్టీ ద‌క్కి తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత హోం మంత్రిగా అమిత్ షాను నియ‌మించుకోవ‌టం ద్వారా నే మోదీ ప‌క్కా వ్యూహాత్మ‌క అడుగులు వేసారు. కాశ్మీర్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారంలో భాగంగా ముందుగా అక్క‌డి ప‌రి స్థితుల పైన కేంద్రానికి అజ‌మాయిషీ తెచ్చుకొనే ప్ర‌య‌త్నం చేసారు. అందులో భాగ‌మే ఆర్టిక‌ల్ 370 రద్దు. దీని ద్వారా కొంత ఆందోళ‌న వ్య‌క్తం అయినా..ముందుకే వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. కాశ్మీర్ లో అవ‌స‌ర‌మైన అన్ని ముంద‌స్తు చ‌ర్య లు తీసుకొని ఆ వెంట‌నే క్యాబినెట్ స‌మావేశంలో బిల్లు ఆమోదించ‌టం..ఆ వెంట‌నే రాష్ట్రప‌తి ఆమోదం పొందేలా చ‌కా చ‌కా అడుగులు వేసారు. ఇప్పుడు దీని పైన ప్ర‌ధాని బుధ‌వారం దేశ ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు. అక్క‌డ శాంతి భ‌ద్ర‌త‌ల బాధ్య‌త త‌మ‌ది అని హామీ ఇవ్వ‌నున్నారు. దీని ద్వారా మోదీకి రాజ‌కీయంగా ఇమేజ్ పెరుగుతుందా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

English summary
As assured in party manifesto by BJP leaders now decided to abolish article 370. BJP founder president Shyam Prasad Mukherjee many time demand for abolish of article 370.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X