వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!

కొత్త విద్యా సంవత్సరం నుండి యూజీసీ విద్యార్థుల కోసం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టాలిన్ సినిమా తరహాలో ఉన్న ఈ నిబంధనతో దేశంలో అక్షరాస్యత 100 శాతం సాధించాలని భావిస్తుంది.

|
Google Oneindia TeluguNews

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. విద్యారంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులను బేస్ చేసుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులలో విద్యా ప్రగతికి, నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తుంది. భారతదేశంలో విద్యారంగంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న మార్పులతో పాటు, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గాను, సంపూర్ణ అక్షరాస్యత సాధించిన దేశంగాను మార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అక్షరాస్యత రేటు 78 శాతంగా ఉంది. దీనిని 100% చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితులలో, యు జి సి కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇక ఈ నిబంధన ప్రకారం విద్యార్థులు యుజిసి చెప్పిన పని చేస్తే దేశంలో 100% అక్షరాస్యత సాధ్యమవుతుంది.

స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు యూజీసీ విద్యార్థులకు చెప్పిందిదే

స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు యూజీసీ విద్యార్థులకు చెప్పిందిదే


అయితే ఆ నిబంధన ఏంటి? అంటే.. స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఒకరికి సహాయం చేస్తే ఆ ఒక్కరు మరో ముగ్గురికి సహాయం చేయాలని ఏ విధంగా అయితే చెబుతాడో, అదేవిధంగా యుజిసి యూనివర్సిటీలోని విద్యార్థులకు ఒక ఆసక్తికరమైన నిబంధన తీసుకువచ్చింది. ఈ నిబంధన ప్రకారం ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చవలసి ఉంటుంది. ప్రతి విద్యార్థి చదువు రాని వారికి చదువు చెప్పి, వారిలో విజ్ఞానాన్ని పెంచవలసి ఉంటుంది. దీంతో దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య తగ్గుతుందని, 2047 సంవత్సరం నాటికి భారతదేశ అభివృద్ధి చెందిన దేశాల జాబితాల సరసన చేరుతుందని యుజి సి అభిప్రాయం వ్యక్తం చేసింది.

 కొత్త విద్యా సంవత్సరం నుండి కొత్త నిబంధన.. అందుకు క్రెడిట్ స్కోర్ కూడా

కొత్త విద్యా సంవత్సరం నుండి కొత్త నిబంధన.. అందుకు క్రెడిట్ స్కోర్ కూడా


విద్యార్థులు ఎవరైతే ఒక్కొకరు ప్రతి సంవత్సరం కనీస ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాసులుగా మారుస్తారో వారికి ప్రతిఫలంగా క్రెడిట్ స్కోర్ ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది. నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించి ఫలితంగా విద్యార్థులు యూజీసీ నుంచి క్రెడిట్ స్కోర్ ను పొందుతారు. ఇది కోర్సు ముగింపులో వారి చివరి ఫలితానికి జోడించబడుతుందని చెబుతున్నారు. ఫైనల్ రిజల్ట్ లో క్రెడిట్ స్కోర్ యాడ్ అవుతుంది కాబట్టి, విద్యార్థులు ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతాయని యుజిసి భావిస్తుంది. యూనివర్సిటీలోనూ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ల లోను చదువుతున్న విద్యార్థులకు ఈ నిబంధన కొత్త విద్యా సంవత్సరం నుంచి వర్తిస్తుందని చెబుతున్నారు.

నిరక్షరాస్యులకు విద్య బోధించి విద్యావంతులను చేస్తే 5 క్రెడిట్ స్కోర్ పాయింట్లు

నిరక్షరాస్యులకు విద్య బోధించి విద్యావంతులను చేస్తే 5 క్రెడిట్ స్కోర్ పాయింట్లు


ఇక ఈ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివరాత్మకమైన మార్గదర్శకాలను విడుదల చేసి, ఈ విధానాన్ని అమలు చేయడం కోసం ప్రతి ప్రాజెక్టు వర్క్ కు, అసైన్మెంట్లకు లింక్ చేయాలన్న చర్చ జరుగుతుంది. ఈ విధానంలో నిరక్షరాస్యులకు విద్యను బోధించడానికి విద్యార్థికి ఐదు క్రెడిట్ స్కోర్ లు ఇవ్వబడతాయి. కానీ అతను అక్షరసత సాధించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. విద్యార్థులు నిరక్షరాస్యులకు విద్యను బోధించి, వారు అక్షరాస్యత సర్టిఫికెట్ పొందినప్పుడు మాత్రమే ఈ క్రెడిట్ స్కోరు విద్యార్థులకు ఇవ్వబడుతుంది.

దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించటానికి యూజీసీ కొత్త నిబంధన

దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించటానికి యూజీసీ కొత్త నిబంధన


నామ మాత్రంగా చదువు నేర్పించాము అని చెప్పటానికి ఏ మాత్రం ఇందులో వీలు లేదు. కచ్చితంగా వారు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సిందే. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో రెండిటిలోనూ ఈ విధానాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి యుజిసి ప్రయత్నం చేయనుంది. మొత్తానికి స్టాలిన్ సినిమా తరహాలో యూజీసీ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది అన్నది వేచి చూడాలి.

English summary
As Chiranjeevi said in the movie Stalin.. UGC has brought new guidelines. Henceforth every year every student will have to convert five illiterates into literates. If they do, they will be given a credit score which will be added to the final result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X