• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుగర్ డేటింగ్... కరోనా దెబ్బతో దేశంలో కొత్త ట్రెండ్... హైదరాబాద్‌లో ఎంతమందో తెలుసా?

|

కరోనా కారణంగా చాలా సంస్థలు తీవ్ర నష్టంగా పోయాయి. మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించేసి ఉద్యోగులపై కూడా వేటు వేశాయి. దీంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగం కోల్పోయి.. భవిష్యత్ మీద బెంగతో చాలామంది ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిస్థితులే డబ్బు సంపాదన కోసం కొంతమందిని సుగర్ డేటింగ్ వైపు తీసుకెళ్తున్నాయి. కరోనా కారణంగా భారత్‌లోనూ సుగర్ డేటింగ్ ట్రెండ్ బాగానే పెరిగినట్లు ప్రముఖ డేటింగ్ సైట్ వెల్లడించింది.

ఏ నగరాల్లో ఎంతమంది....

ఏ నగరాల్లో ఎంతమంది....


సీకింగ్అరెంజ్‌మెంట్ అనే ఓ ప్రముఖ సుగర్ డేటింగ్ సైట్ విడుదల చేసిన డేటా ప్రకారం... భారత్‌లో ముంబై సుగర్ డేటింగ్‌కి హాట్ బెడ్‌గా మారింది. ఇక్కడ దాదాపు 6,624 మంది సుగర్ బేబీస్ ఉండగా 21,464 మంది సుగర్ డాడీస్ ఉన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో దాదాపు 3447 మంది సుగర్ బేబీస్,13,127 మంది సుగర్ డాడీస్ ఉన్నారు. హైదరాబాద్‌లోనూ 1218 మంది సుగర్ బేబీస్,11,784 మంది సుగర్ డాడీస్ ఉన్నారు. పుణే,అహ్మదాబాద్,చెన్నై,కోల్‌కతా,బెంగళూరు,సూరత్,జైపూర్ నగరాల్లోనూ సుగర్ డేటింగ్‌కి బాగానే ఆదరణ ఉంది.

అసలేంటీ సుగర్ డేటింగ్...

అసలేంటీ సుగర్ డేటింగ్...

సుగర్ డేటింగ్ అనేది ఒక వ్యక్తిగత సంబంధం. ఇందులో పరస్పర అంగీకారంతో ఇద్దరు వ్యక్తులు ఒక సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు. డబ్బు లేదా ఆర్థిక ప్రయోజనాలు,కానుకల కోసం సుగర్ డేటింగ్ చేసేవారిని సుగర్ బేబీ అంటారు. అలాగే తమతో సంబంధానికి ప్రతిఫలంగా... చెప్పిన ప్రయోజనాలను నెరవేర్చేవారిని సుగర్ డాడీస్ లేదా సుగర్ మమ్మీస్ అంటారు. అంటే,వీరు వాళ్లకు డబ్బు,బహుమతులు ఇతరత్రా సహాయ సహకారాలు అందిస్తారు.

ఖర్చుల కోసం...

ఖర్చుల కోసం...

సీకింగ్‌అరెంజ్‌మెంట్ యాప్ సీఈవో బ్రాండన్ వేడ్ మాట్లాడుతూ.... భారత్‌లో నిరుద్యోగం 27.11శాతానికి చేరడంతో చాలామంది పట్టణ ప్రాంతాల యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెరుగుతున్న ఖర్చులు,ఎడ్యుకేషన్ లోన్స్, ఇతరత్రా వాటి కోసం సుగర్ డేటింగ్ ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒక సుగర్ బేబీ నెలకు రూ.35వేలు సంపాదించగలరని.. తద్వారా వారి ఖర్చులు తీరుతున్నాయని తెలిపారు.

రిలేషన్‌షిప్ కోసమే కాదు...

రిలేషన్‌షిప్ కోసమే కాదు...

సుగర్ డాడీస్,సుగర్ మమ్మీస్ కేవలం రిలేషన్‌షిప్ పెట్టుకుని ఆర్థిక సహాయం చేసేవాళ్లుగా మాత్రమే ఉండరు. వీరిలో కొంతమంది మార్గదర్శకులుగా కెరీర్‌కు సంబంధించి విలువైన సలహాలు,సూచనలిస్తారు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సలహాలు,సూచనలిస్తూనే ఫైనాన్షియల్ గైడెన్స్ కూడా ఇస్తారు. సీకింగ్‌అరెంజ్‌మెంట్ అనేది మిగతా డేటింగ్ యాప్స్ లాగే పనిచేస్తుంది. యాప్‌లో లాగిన్ అయ్యేవారికి 'సక్సెస్&వెల్త్', 'లుక్స్&చార్మ్' అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో తమకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ యాప్ ప్రకారం.. సుగర్ డాడీస్ లేదా సుగర్ మమ్మీస్ అంటే... జీవితంలో సక్సెస్ సాధించి ఉన్నవారు. డబ్బుకు కొదువలేనివారు. తమ పక్కన ఆకర్షనీయమైన పురుషుడు లేదా మహిళ కంపెనీని ఆస్వాదించేవారు. సుగర్ బేబీ అంటే ఆకర్షణీయంగా ఉండి ఎదుటివాళ్ల నుంచి ఏదో ఒకటి ఆశించేవారు. అందుకు ప్రతిఫలంగా వారితో సంబంధం ఏర్పరుచుకోవడమో లేక కంపెనీ ఇవ్వడమో చేసేవారు.

English summary
Data released by leading sugar dating website and app SeekingArrangement states that Mumbai is the hotbed for sugar dating in India, with 6,246 sugar babies and 21,464 sugar daddies, followed by New Delhi with 3,447 sugar babies and 13,127 sugar daddies. Hyderabad trails closely behind with 1,218 sugar babies and 11,784 sugar daddies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X