వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ వైపు జిన్‌పింగ్‌తో మోడీ భేటీ: క్షిపణి ప్రయోగంలో పాక్ బిజీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం సాయంత్రం తమిళనాడులోని మహాబలిపురంలో భేటీ కాగా.. మరో వైపు దాయాది దేశం పాకిస్థాన్ తన పనిలో తాను మునిగిపోయింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ ఈ రోజునే కరాచీ పోర్టు సమీపంలో భారీ క్షిపణిని ప్రయోగించేందుకు సిద్ధమైంది.

ఏ నోటిసెస్ టు ఎయిర్‌మెన్(నోటమ్) పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అధికారులు అక్టోబర్ 10 ఉదయం 9.30గంటల నుంచి 11.30గంటల వరకు, అక్టోబర్ 11, 12 మధ్యలో కూడా 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య కాలంలో వాయు మార్గాలను మళ్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్‌లోని కరాచీకి వాయువ్యంలోని 40 కి.మీ పరిధి(సోన్మియాని టెస్ట్ రేంజ్) గల క్షిపణిని పరీక్షించేందుకు పాకిస్థాన్ ప్రణాళికలు వేసిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే కరాచీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలు కూడా ఇతర విమానాశ్రయాలకు మళ్లించబడ్డాయి.

As Modi-jinping to hold talks in Mahabalipuram today, Pak plans big missile test

ఆపరేషనల్ కారణాల వల్లే ఈ ఆదేశాలను జారీ చేసినట్లు నోటమ్‌లో పాక్ అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో కూడా ఇలాంటి ఆదేశాలనే పాకిస్థాన్ అధికారులు జారీ చేశారు. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల గజ్నవి క్షిపణిని పాకిస్థాన్ పరీక్షించింది. పాకిస్థాన్ తన శక్తిని నిరూపించుకునేందుకు ఇలాంటి ప్రయోగాలను చేపడుతోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

మహాబలిపురంలో జిన్‌పింగ్‌తో మోడీ సమావేశం
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంకు చేరుకున్న జిన్‌పింగ్ నేరుగా ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌కు చేరుకున్నారు. దారిపొడవునా ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆయన కాసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకుని మహాబలిపురంకు బయలుదేరి వెళ్లారు. మహాబలిపురంకు చేరుకున్న ఆయనకు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు.

అంతకుముందు మహాబలిపురంకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ అపియరెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ధోవతీ చొక్కా కండువాలను ధరించి వావ్ అనిపించారు ప్రధాని మోడీ. జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన అనంతరం ఇరుదేశాధినేతలు మహాబలిపురంలోని షోర్ ఆలయంలో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వివరించారు. అర్జునుడు తాను పొందిన ఆయుధం గురించి వివరించారు. పలు శిల్పాలను ఎంతో ఆసక్తితో తిలకించారు జిన్‌పింగ్.

English summary
Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping are all set to meet for their second informal talks to be hosted in Tamil Nadu's Mahabalipuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X