వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిమాండ్ పెరిగింది!: 700కేజీల ఉల్లి దోచేశారు

|
Google Oneindia TeluguNews

ముంబై: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో దొంగలు కూడా తమ రూటు మార్చారు. ఇప్పటి వరకు డబ్బులు, బంగారం దోచుకున్న దొంగలు.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఉల్లిగడ్డలపై పడ్డారు.

మహారాష్ట్రలోని ముంబైలో ఏకంగా 700కిలోల ఉల్లిగడ్డలను దొంగిలించారు. స్థానిక వడాలా ప్రాంతంలోని ప్రతీక్ష నగర్‌లో అనంత్ నాయక్ అనే వ్యక్తి దుకాణం నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 700 కిలోల ఉల్లిగడ్డలను దొంగలించారు.

As Prices Soar, 700 kg of Onion Stolen From a Market in Mumbai

శుక్రవారం రాత్రి షాపునకు తాళం వేసుకుని వెళ్ళి, శనివారం ఉదయం వచ్చి చూసేసరికి సరకు అపహరణకు గురవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. చోరీకి గురైన ఉల్లిగడ్డల విలువ సుమారు రూ. 50వేల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశంలో కిలో ఉల్లి ధర రూ. 80పైనే పలుకుతుంది. ముంబై మార్కెట్‌లో మాత్రం కిలో ఉల్లి ధర రూ. 65గా ఉంది. ఢిల్లీలో అయితే రూ. 75 నుంచి రూ. 80 మధ్య ఉంది.

English summary
With onion prices shooting to alarming levels across the country, nearly 700 kilograms of the vegetable have been stolen from a market in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X