వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ ప్రశ్న:ఆధార్ తో ఉపయోగాలిలా...ఆధార్ తో నగదు లావాదేవీలు

దృవీకరణ పత్రాలను ఆన్ లైన్ లో భద్రపరుచుకొనేందుకు ఉపయోగపడే డిజిలాకర్ కు ఆధార్ ఉపయోగపడుతోందని ఆధార్ ప్రాజెక్ట్ కు కీలంగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:ధృవీకరణ పత్రాలను ఆన్ లైన్ లో భద్రపరచుకొనేందకు ఉపయోగపడే డిజిలాకర్ కు ఆధార్ ఉపయోగపడుతోందని ఆధార్ ప్రాజెక్టుకు కీలకంగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని చెప్పారు. వేగం, స్థాయి ఉంటే తప్ప నిజంగా అనుకొన్న దాన్ని తాము సాధించలేమని నిలేకని చెప్పారు.

మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ళ, ఆధార్ ప్రాజెక్టకు కీలకంగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని లు ఇకే వేదికను పంచుకొన్నారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు.

బెంగుళూరు వేదికగా జరిగిన టెక్ టైటాన్స్ వేదికపై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. ఆధార్ ప్రాజెక్టుకు సంబంధించిన తనకున్న సందేహలను సత్య నాదెళ్ళ నందన్ నిలేకనిని అడిగి తెలుసుకొన్నారు.

డిజిటల్ యుగంలో తమ అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకొన్నారు. అయితే అదే సందర్భంలో తమ సందేహాలను కూడ ఇద్దరూ కూడ నివృత్తి చేసుకొనే ప్రయత్నాలు చేశారు.

ఆధార్ పై ప్రశ్నలు కురిపించిన సత్య నాదెళ్ళ

ఆధార్ పై ప్రశ్నలు కురిపించిన సత్య నాదెళ్ళ

ఆధార్ కు సంబంధించి తనకున్న సందేహలను మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదెళ్ళ నందన్ నిలేకనిని అడిగి తెలుసుకొన్నారు. ఆధార్ ఫ్లాట్ ఫామ్ ను సత్యనాదెళ్ళ ప్రశంసించారు. టెక్నాలజీ పరంగా ఆధార్ పై తనకున్న విజన్ దాని ప్రభావం ఏమిటనే విషయాలను నిలేకని అడిగారు సత్య నాదెళ్ళ.అయితే ఆధార్ ను తాను డిజైన్ చేస్తున్న సమయంలో ఆధార్ ఫ్లాట్ ఫామ్ కు ఓ వేగం స్థాయి ఉంది. ఆ వేగం స్థాయి ఉంటే తప్ప నిజంగా అనుకొన్న దాన్ని సాధించలేమని నందన్ నిలేకని సత్య నాదెళ్ళకు వివరించారు.

డిజిటల్ చెల్లింపు ఇండియాలో 5 శాతమే

డిజిటల్ చెల్లింపు ఇండియాలో 5 శాతమే

భారత్ లో డిజిటల్ చెల్లింపులు ఐదు శాతం మాత్రమే ఉన్నాయని, వచ్చే ఏడాదికి డిజిటల్ చెల్లింపుల వైపుకు ప్రజలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నందన్ నిలేకని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ఐదు శాతంగా ఉన్న ఈ సంఖ్య వచ్చే ఏడాదికి గాను కనీసంగా 15 నుండి 20 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆధార్ ఆధారిత లావాదేవీలే అధికం

ఆధార్ ఆధారిత లావాదేవీలే అధికం

డిజిటల్ లావాదేవీల్లో ప్రస్తుతం కార్డు లావాదేవీలే అత్యధికంగా ఉన్నాయని నందన్ అభిప్రాయపడ్డారు.అయితే రానున్న కాలంలో ఆధార్ ఆధారిత లావాదేవీలు పెరిగే అవకాశాలున్నాయని నందన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తాము ప్రారంభించిన ఆధార్ కు ప్రభుత్వాలు సానుకూలంగా మద్దతు ప్రకటించడం వల్ల తమ పని సులభంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

వంద కోట్లను దాటిన ఆధార్ కార్డులు

వంద కోట్లను దాటిన ఆధార్ కార్డులు

ఆధార్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఐదున్నర ఏళ్ళలోనే బిలియన్ యూజర్లను చేధించినట్టుగా నందన్ నిలేకని చెప్పారు. గత రెండు నుండి మూడు ఏళ్ళలోనే ఆధార్ కు అనూహా్య స్పందన వస్తోందని నిలేకని చెప్పారు. ఆధార్ ఆధారిత కెవైసీని వాడుతూ రిలయన్స్ జియో కూడ తక్కువ సమయంలోనే ఎక్కువమంది చందాదారులను పోగు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఆధార్ కు మరింత డిమాండ్ పెరిగిందన ఇయన చెప్పారు.

English summary
Microsoft's India-born chief executive officer Satya Nadella on Monday praised the Aadhaar platform saying "it's pretty tremendous how it got started" and the speed at which it was scaled. "It's very comparable to any other internet scale ramp-up," Mr Nadella said in an interaction with Nandan Nilekani, the architect of Aadhaar, India's ambitious, biometrics-based citizen identification program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X