వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు, పవన్, బాలయ్య, కష్బూ ప్రచారం! (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనెల 22వ తేదిన బీబీఎంపీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పలు పార్టీల నాయకులు ఈ ఎన్నికలలో తాము గెలుపోంది కార్పొరేటర్లు కావాలని శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటి ఉంది. ఈ రెండు పార్టీల నాయకులు సినీ తారలతో ప్రచారం చేయించి అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

అందు కోసం కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాలం, బాలివుడ్ తారలతో ప్రచారం చేయించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. మెగస్టార్ చిరంజీవి, బహుబాష నటి కుష్బు, మాజీ ఎంపీ బహుబాష నటి రమ్యాతో తాము ప్రచారం చేయిస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ తెలిపారు.

మెగాస్టార్ తో ప్రయత్నం

మెగాస్టార్ తో ప్రయత్నం

బెంగళూరు నగరంలో సుమారు 25 లక్షల మంది తెలుగు వారు నివాసం ఉంటున్నారు. గతంలో రెండు అంకెల సంఖ్యలో కార్పొరేటర్లుగా తెలుగు వారు గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ, మెగాస్టార్ చిరంజీవితో ప్రచారం చేయిస్తే ఫలితం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. చిరు పుట్టిన రోజు ఆగస్టు 22న పోలింగ్ జరగనుంది.

పోటిగా పవర్ స్టార్

పోటిగా పవర్ స్టార్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రచారం చెయ్యించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ బెంగళూరు వచ్చిన సమయంలో ఇదే విషయంపై వినతి పత్రం సమర్పించారు. బెంగళూరులో పవర్ స్టార్ తో ప్రచారం చేయించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి మీద ఒత్తిడి తెస్తున్నారు.

బాలయ్య వస్తాడా

బాలయ్య వస్తాడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టీడీపీలో ఉన్నచాల మంది నాయకులు బెంగళూరులో అనేక సంవత్సరాల నుండి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని హిందూపురం ఎంఎల్ఏ, లెజండ్ బాలయ్యతో ప్రచారం చేయించాలని బీజేపీ నాయకులు అంటున్నారు.

జయలలిత ప్రభావం

జయలలిత ప్రభావం

బెంగళూరులోని ఓకళిపురం, సుభాష్ నగర్, కాటన్ పేట నుండి ముగ్గురు అన్నా డీఎంకే అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళ ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలలో అభ్యర్థులను జయలలిత ఎంపిక చేశారు. చెన్నయ్ లో స్వయంగా జయలలిత ఈ జాబితాను విడుదల చేశారు.

కరుణిస్తారా,

కరుణిస్తారా,

బెంగళూరు నగరంలో తమిళ ప్రజలు లక్షలాధి మంది ఉన్నారు. తమిళ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కురుణానిధి కి చెందిన డీఎంకే పార్టీ నుండి కొందరు పోటి చేస్తున్నారు.

క్యాప్టెన్ వర్గీయుల అయోమయం

క్యాప్టెన్ వర్గీయుల అయోమయం

డీఎండీకే చీఫ్, క్యాప్టెన్ విజయ్ కాంత్ వర్గీయులు అయోమయంలో పడ్డారు. ఇంత కాలం వీరు బీజేపీకి ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

కుష్బూ మేడం వస్తారు

కుష్బూ మేడం వస్తారు

బహూబాష నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూతో బెంగళూరులో తమిళ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.

రెబల్ స్టార్ అంబరీష్

రెబల్ స్టార్ అంబరీష్

రెబల్ స్టార్, మంత్రి అంబరీష్, ఆయన సతీమణి సుమలతతో ప్రాచారం చేయించాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సుమలత తెలుగింటి ఆడపడుచు కావడంతో ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

రమ్యా మామూలే

రమ్యా మామూలే

బాహుబాష నటి, మాజీ ఎంపీ రమ్యాతో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. అయితే పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు నాయకులు అంటున్నారు.

వీరు ఉండనే ఉన్నారు.

వీరు ఉండనే ఉన్నారు.

ఇక కన్నడ సినీ రంగానికి చెందిన ఎంఎల్ సీ తారతో పాటు గోల్డన్ స్టార్ గణేష్, శృుతి, భావన, కర్ణాటక మంత్రి ఊమాశ్రీతో పాటు పలువురు సినీ తారలు బీబీఎంపీ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేస్తున్నారు.

English summary
Tollywood mega star Chiranjeevi, Sandalwood actress Ramya, and Tamil actress Kushboo and many others are busy campaigning for the congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X