వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు మోదీ భారీ షాక్ -బైడెన్‌తో మాటామంతి -‘విదేశీ నేతల’పై ఆంక్షల వేళ సంచలనం

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడిచాయి. గత శనివారం నాటికే 290 ఓట్లతో డెమోక్రాట్ జోబైడెన్ తర్వాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం(నవంబర్ 12) నాటికి 217 ఓట్ల దగ్గరే నిలిచిపోయినప్పటికీ రిపబ్లికన్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలపై న్యాయపోరాటం చేస్తూనే.. ప్రపంచ దేశాల నుంచి బైడెన్ కు అభినందనలు, సందేశాలు, మద్దతు అందకుండా కఠిన ఆంక్షలు విధించారు. సరిగ్గా ఈ సమయంలోనే భారత్ కీలక ఎత్తుగడను సిద్ధం చేసింది..

షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూషాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూ

ట్రంప్‌కు మోదీ షాక్

ట్రంప్‌కు మోదీ షాక్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు అధికారమార్పిడి చేసేందుకు ససేమిరా అంటోన్న ట్రంప్ కార్యవర్గం.. తాజాగా వివిధ దేశాల అధినేతలు బైడెన్‌ను అభినందిస్తూ పంపుతోన్న సందేశాలను నిలిపేసింది. సాధారణంగా ఆయా దేశాల నుంచి వచ్చే అధికారిక సందేశాలను అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా బట్వాడా అవుతుంటాయి. సందేశాల నిలిపివేత నేపథ్యంలో ఆ శాఖ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. రెండో టర్మ్ లోనూ ట్రంప్ కే అధికార మార్పిడి జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో భారత్ విదేశాంగ శాఖ వెల్లడించిన సమాచారం ట్రంప్ కు మోదీ షాకిచ్చినట్లుగానే గోచరిస్తున్నది.

అమెరికాలో మళ్లీ ఎన్నికలు?: ట్రంప్ శిబిరం ట్వీట్‌తో కలకలం -అధికార మార్పిడి మళ్లీ అయనకేనటఅమెరికాలో మళ్లీ ఎన్నికలు?: ట్రంప్ శిబిరం ట్వీట్‌తో కలకలం -అధికార మార్పిడి మళ్లీ అయనకేనట

బైడెన్‌తో మోదీ మాటామంతి

బైడెన్‌తో మోదీ మాటామంతి


తాజాగా అమెరికా ఎన్నికల్లో గందరగోళం, తానే గెలిచానని ట్రంప్ మంకుపట్టుపడుతోన్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా దేశాధినేతలతో ఫోన్‌లో సంభాషించారు. జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే ట్విటర్ ద్వారా అభినందనలు చెప్పారని గుర్తుచేస్తూ.. ‘‘అతి త్వరలోనే ఇద్దరికీ అనువైన సమయంలో మోదీ -బైడెన్ మాట్లాడుకుంటారు''అని శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాదు..

అమెరికాతో సంబంధాలు మరింతగా..

అమెరికాతో సంబంధాలు మరింతగా..


‘‘భారత్, అమెరికాల మధ్య ప్రస్తుతానికి ఆరోగ్యకర సంబంధాలు కొనసాగుతున్నాయి. ద్వైపాక్షికంగానే కాకుండా, అంతర్జాతీయ వేదికలపైనా పరస్పర సహకారం కొనసాగుతున్నది. అయితే, కొత్త ప్రభుత్వం(జోబైడెన్ హయాం)లో కూడా ఇదే పాజిటివిటీ కొనసాగుతుందని, రెండు దేశాల మధ్య బంధాలు మరింత ధృఢం అవుతాయని కూడా భారత్ ఆశిస్తున్నది. సమయం చూసుకొని మోదీ-బైడెన్ చర్చలు జరుపుతారు''అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Recommended Video

US Election 2020 Results: Trump Wins Alaska, Joe Biden On Donald Trump
మోదీ-ట్రంప్ దోస్తానా..

మోదీ-ట్రంప్ దోస్తానా..

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కు అమెరికా తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా అధినేతల మధ్య స్నేహం విరాజిల్లిన సందర్భం మాత్రం మోదీ-ట్రంప్ జమానాలోనే చోటుచేసుకుంది. అగ్రరాజ్యాధినేతగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ట్రంప్ తనకు మంచి మిత్రుడని మోదీ పలు మార్లు కీర్తించారు. ఇప్పటిదాకా ఏ నాయకుడూ సాహసించని రీతిలో ఏకంగా ఎన్నికల ప్రచారం కూడా చేసిపెట్టి ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్'అని మోదీ నినదించారు. ట్రంప్ సైతం మోదీ ఆహ్వానాన్ని మన్నించి, తన చివరి విదేశీ ప్యటనగా భారత్ కు వచ్చి, ‘నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్-మోదీ హయంలో వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి. తాజాగా ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ గద్దె దిగబోనని మొండికేస్తున్న తరుణంలో మోదీ.. జోబైడెన్ కు అభినందనలు చెప్పడం, త్వరలోనే మాట్లాడనుండటం గమనార్హం.

English summary
Prime Minister Narendra Modi and United States president-elect Joe Biden will speak with each other in due course at a mutually convenient time, the Ministry of External Affairs said on Thursday and asserted that India-US ties enjoy bipartisan support in America. amid US State Department is preventing Biden from accessing messages from foreign leaders, india's statement creates buzz
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X