వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశారాం ఆస్తుల 10,000 కోట్లు! భూముల లెక్క తేలాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Asaram accumulated wealth worth Rs.10,000 crore
సూరత్: వివాదాస్పద ఆశారాం బాపూ దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు. ఆశారాం లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో చిక్కుల్లో పడ్డారు. ఆయన సంపద విలువ సుమారు పదివేల కోట్ల రూపాయల దాకా ఉండవచ్చని అంచనా.

ఇందులో ఆయన సమకూర్చుకున్న భూముల విలువను ఇంక చేర్చనే లేదని నగర పోలీసు కమిషనర్ చెప్పారు. ఆశారాం ఆశ్రమాలపై పోలీసుల దాడుల సందర్భంగా ఈ నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, భూమి డాక్యుమెంట్లను పోలీసులు దాడుల్లో స్వాధీనపరచుకున్నారు.

బయటపడిన డబ్బు విలువ తొమ్మిది నుండి పదివేల కోట్ల దాకా ఉండొచ్చని నగర కమిషనర్ రాకేష్ అంటున్నారు. భూముల విలువ తెలియాల్సి ఉందన్నారు. గుజరాత్‌లో 45 చోట్ల, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములున్నట్లు గుర్తించామన్నారు.

ఇంకా విశ్లేషించాల్సిన ఆస్తి పత్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు, ఆదాయ పన్ను, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులకు పోలీసు కమిషనర్ వివరించారు. ఆస్తుల విషయంలో ఆశారాం చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఇంకా దర్యాఫ్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

English summary
Self styled godman Asaram has accumulated wealth to the tune of Rs.10,000 crore and vast tracts of land across the countrey, the value of which is yet to be assessed, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X