వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భర్త వేరే యువతిని తల్లిని చేశాడు

|
Google Oneindia TeluguNews

ఇండోర్: భర్త, మామ నిత్యం తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కోడలు జానకి పోలీసులకు ఫిర్యాదు చేసి వాంగ్మూలం ఇచ్చింది. జానకి తన భర్త, మామ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేసిందని పోలీసు అధికారుల తెలిపారు.

ఇప్పటికే వేర్వేరు లైంగిక వేదింపుల కేసులో జైలులో ఉన్న ఆ ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చెయ్యాలని జానకి పోలీసు అధికారులకు మనవి చేసింది. రాజస్థాన్ లోని ఖాజురాణా పోలీసుల కథనం మేరకు గత సెప్టెంబర్ 19వ తేదిన ఆశారాం బాపు కోడలు జానకి ఫిర్యాదు చేశారు.

అయితే నవంబర్ 24వ తేది మంగళవారం జానకి వాగ్మూలాన్ని రికార్డు చేసేందుకు స్టేషన్ కు పిలిపించారు. ఈ సందర్బంలో జానకి పలు ఆసక్తికరమైన వివరాలు చెప్పారని పోలీసులు తెలిపారు.

తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, వారి పట్ల చెడుగా ప్రవర్తించేవాడని జానకి పోలీసులకు చెప్పారు. అంతే కాకుండ ఓ యువతిని లొంగదీసుకుని గర్బవతిని చేశాడని చెప్పారు.

Asaram Bapu daughter-in-law records statement against him

తరువాత ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. తనకు విడాకులు ఇచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడని జానకి పోలీసులకు చెప్పారు.

తాను ఈ విషయం తెలుసుకుని తన భర్తను నిలదీసినందుకు తనను చీకట్లో మగ్గేలా తన భర్త, మామ ప్రయత్నించారని ఆరోపించారు. తన తండ్రి దేవరాజ్ కృష్ణానిని మాటలతో మభ్య పెట్టి మా ఆస్తులు మొత్తం ఆశ్రయం పేరుతో వ్రాయించుకున్నారని చెప్పారు.

తాను నారాయణ్ ను 1997 మే 22వ తేదిన వివాహం చేసుకున్నానని జానకి సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఇదే సందర్బంలో జానకి పెళ్లి నాటి ఫోటోలు, వీడియోలు, ఇతర పత్రాలను ఆమె న్యాయవాది తమకు ఇచ్చారని పోలీసులు వివరించారు.

English summary
Janaki's lawyer Rohit Yadav said she handed over wedding photographs and some documents to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X