వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశారాం కేసు: వెనుక నుండి రాత్రిపూట ఆశ్రమంలోకి అమ్మాయిలు, ఆ సాక్ష్యమే కీలకం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మైనర్‌బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధించడం పట్ల ఆయన వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన సతీష్ వాద్వానీ హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

రేప్‌ కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు,విచారణాధికారికి బెదిరింపులురేప్‌ కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు,విచారణాధికారికి బెదిరింపులు

ఆశారాం బాపుపై ఐదేళ్ళక్రితం మైనర్‌బాలికపై అత్యాచారం చేశారనే అభియోగాలపై జోధ్‌పూర్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదును విధించింది. మరో ఇద్దరికి 20 ఏళ్ళ పాటు శిక్షను విధిస్తూ తీర్పును చెప్పింది.

ఆశారాం బాపు ఆశ్రమంలోనే బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని 2013లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై జోద్‌పూర్ కోర్టు విచారణను ఏప్రిల్ 7న పూర్తి చేసి ఏప్రిల్ 25న తుది తీర్పును వెలువరించింది.

నాపై ఆశారాం కొడుకు దాడి

నాపై ఆశారాం కొడుకు దాడి

ఆశారాం వద్ద సుదీర్ఘ కాలం పాటు సతీష్ వాద్వానీ పనిచేశాడు. డ్రైవర్‌, వంట మనిషిగా, బాడీగార్డుగా ఆయన పనిచేశాడు. ఆశ్రమంలో చిన్నారులపై లైంగిక దాడుల విషయాన్ని తెలుసుకొన్నఆయన ఈ విషయాన్ని ఆశారాంతో పాటు ఆయన కొడుకును ప్రశ్నించాడు. దీంతో తనపై ఆశారాంతో పాటు ఆయన కొడుకు దాడికి దిగారని సతీష్ చెప్పారు. పదేళ్ళపాటు ఆశారాం ఆశ్రమంలో ఈ దారుణాలను తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు.

 వెనుక గేటు నుండి ఆశ్రమంలోకి అమ్మాయిలు

వెనుక గేటు నుండి ఆశ్రమంలోకి అమ్మాయిలు

సూర్యాస్తమయం తర్వాత ఆడపిల్లలకు ఆశ్రమంలో ప్రవేశం లేదని ఇండోర్ స్టేడియం ముందు రాసి ఉంటుంది. అయితే అర్థరాత్రి తర్వాత వెనుక గేటు నుంచి పలువురు యువతులు వచ్చి మెడిటేషన్ గదుల్లో గడిపేవారని ఆశారాం వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన సతీష్ చెప్పారు. అయితే అనేక సార్లు వెనుక గేటు నుండి ఆశ్రమంలోకి వచ్చే అమ్మాయిలను తాను స్వయంగా వెనక్కి పంపించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఆశారాం కేసులో సతీష్ కీలకం

ఆశారాం కేసులో సతీష్ కీలకం

సతీష్ వాద్వానీ 1998లో ఆశారాం బాపు వద్ద పనిలో చేరాడు. తొలుత ఆశారాం వాహనానికి డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన వ్యక్తిగత సంరక్షుడిగా పనిచేశాడు వంటవాడిగా కూడ ఆయన అవతారమెత్తాడు. 1998 నుండి 2010 వరకు సతీష్ ఆశారాం ఆశ్రమంలో పనిచేశాడు. అహ్మదాబాద్ అత్యాచారం కేసు, నారాయణసాయి సూరత్‌ ఆశ్రమంలో పాల్పడిన అత్యాచారం కేసులో సతీష్ కీలకమైన సాక్షాలు కోర్టులో చెప్పాడు.

ఆశారాంకు శిక్షతో న్యాయం గెలిచిందన్న సతీష్

ఆశారాంకు శిక్షతో న్యాయం గెలిచిందన్న సతీష్

ఆశారాం బాపుతో పాటు మరో ఇద్దరికి ఈ కేసులో శిక్షలు పడడంతో న్యాయం గెలిచిందని ఆశారాం వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన సతీష్ అభిప్రాయపడ్డారు. ఆశారాం బాపూ, అతడి కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లో పాల్పడిన అకృత్యాలపైనా ఇలాంటి తీర్పే వస్తుందని ఆశించినట్టు ఆయన చెప్పారు. ఈ కేసు విషయమై తన సాక్ష్యాన్ని రికార్డు చేసిన తర్వాత బెదిరింపులు రావడంతో ప్రభుత్వం సతీష్ కు గన్‌మెన్లను కేటాయించింది.

English summary
The former car driver and body guard of Asaram and his son Narayan Sai hailed the Jodhpur court verdict of Wednesday pronouncing life imprisonment to the self-proclaimed godman in a minor’s sexual assault case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X