వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం: నేడు తేలనున్న ఆశారాం బాపు భవితవ్యం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పదహరేళ్ళ బాలికపై ఆశారాం బాపు అత్యాచారం చేశారనే ఆరోపణలపై జోథ్‌పూర్ కోర్టు బుధవారం నాడు తీర్పును వెలువర్చనుంది. ఈ తీర్పును పురస్కరించుకొని దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షాజహాన్ పూర్ లోని మనాయి ఆశ్రమంలో 2013లో ఆశారాం పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని నమోదైన కేసులో కోర్టు విచారించింది.

Asaram rape case verdict today, 4 states told to tighten security

నిందితుడైన ఆశారాం జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని నియమించారు. ఆశారాం కేసులో తీర్పు వెలువడిన అనంతరం ఆయన భక్తులు ఎలాంటి ఆందోళన చేయకుండా ముందుజాగ్రత్తగా నాలుగు రాష్ట్రాల్లో అదనపు సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది.

English summary
A trial court in Jodhpur will pronounce its verdict in the rape case involving Asaram on Wednesday.Asaram has been accused of sexually exploiting a 16-year-old girl from UP’s Shahjahanpur in his Manai ashram near Jodhpur in 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X