వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ కాంట్రాక్టు కిల్లర్.. ప్రజాస్వామ్యం ఖూనీ: రాజస్థాన్ సీఎం ఫైర్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ను ఆహ్వానించడం వివాదంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ చేత గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రమాణం చేయించడాన్ని రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఎస్పీ, డీఎంకే, కాంగ్రెస్‌తోపాటు పలువురు నేతలు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. గవర్నర్ ఎవరి వారైతే వారిదే సర్కార్ అని ఎద్దేవా చేశారు.

అజిత్ పవార్‌పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపుఅజిత్ పవార్‌పై వేటేసిన శరద్ పవార్: ఎన్సీపీ లేజిస్లేటివ్ పార్టీ నేతగా తొలగింపు

తాజా రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. బీజేపీ ప్రజాస్వామ్యానికి కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారింది అని ఓ ప్రకటనలో తెలిపింది. మా ఎమ్మెల్యేలు నిజాయితీ ఉన్నారు. అమిత్ షా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయలేరని కాంగ్రెస్ పేర్కొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుఅప్రజాస్వామికం. ప్రజల తీర్పును కాలరాచారు అని ఆప్ ఓ ప్రకటనలో తెలిపింది.

Ashok Gehlot: Governor connived with BJP leaders and hatched a conspiracy

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలి. వీలైతే వెంటనే మెజారిటీ రుజువు చేసుకోవాలి అని అన్నారు. బీజేపీ నేతలతో గవర్నర్ కుమ్మక్కై కుట్రకు తెరతీశాడు అంటూ ఘాటుగా స్పందించారు. బీజేపీ డర్టీ పాలిటిక్స్‌తో మహారాష్ట్ర రాజకీయాలు కలుషితం అయ్యాయి. అనైతికానికి పాల్పడిన గవర్నర్ రాజీనామా చేయాలి అని అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు.

కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ వైబీ చవాన్ సెంటర్‌లో కీలక భేటిని ముంబైలొ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 42 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు సమాచారం. సమావేశానికి ముందు ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలను శివసేన నేతలు ఎయిర్‌పోర్టు నుంచి తీసుకువచ్చి వైబీ చవాన్ సెంటర్‌లో వదిలి వెళ్లినట్టు తెలిసింది.

English summary
Ashok Gehlot says, President should intervene immediatley, they should proved majority as soon as possible. Governor connived with BJP leaders and hatched a conspiracy. BJP has played dirty politics in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X