వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

102 కాదు, 25 మంది నాతో ఉన్నారు: గెహ్లట్ ప్రకటనపై సచిన్ పైలట్

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్‌లో మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. బలబలాలపై అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ రకరకాల వాదనలు కొనసాగిస్తున్నారు. గెహ్లట్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని పేర్కొన్నారు. అయితే ఇది తప్పు అని.. తనతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని పైలట్ తెలిపారు. వారు తనతోనే ఉన్నారని.. జైపూర్‌లో జరిగే సీఎల్పీ సమావేశంలో పాల్గొనలేదన్నారు.

గెహ్లట్ మాత్రం తనతో 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఫైరయ్యారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్య అని అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సచిన్ పైలట్ వచ్చి మాట్లాడాలని సూచించారు. సమస్య ఉంటే తనకు చెప్పాలని.. పరిష్కరిస్తామని తెలిపారు. అంతర్గత సమస్య పరిష్కరించుకుంటామని మరో నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Ashok Gehlot’s claim of 102 MLAs wrong, 25 sitting with me: Sachin Pilot

Recommended Video

Locusts Swarms To Enter Telangana || జూన్ 20-జులై 5 వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం !!

మరోవైపు జైపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో సచిన్ పైలట్ ఫోటో ప్రత్యక్షమైంది. సంక్షోభం నేపథ్యంలో అతని ఫోటో తిరిగి కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైలట్‌ను దారిలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన మాత్రం చర్చలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది.

English summary
Rajasthan Deputy Chief Minister Sachin Pilot on Monday said he has the support of 25 MLAs and added that they are not going to Jaipur to attend the clp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X