వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్రమ్ వెబ్ సిరీస్ కలకలం: నిండా అలాంటి సీన్లే: ఆ స్టార్ హీరోకు కోర్టు నోటీసులు: నిర్మాతకూ

|
Google Oneindia TeluguNews

జైపూర్: సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో లీడ్ క్యారెక్టర్‌లోని నటించిన బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్.. ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాత ప్రకాష్ ఝా.. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది. వారిద్దరికీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉండటం, కొందరు మఠాధిపతులను కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయనే కారణాలతో న్యాయస్థానం వారికి నోటీసులను జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

ఉమ్మడి శతృవు మోడీతో ఢీ: కమల్ హాసన్-ఒవైసీ దోస్తీ: ఎంఎన్ఎం-ఎంఐఎం పొత్తు: రజినీ ఎంట్రీతోఉమ్మడి శతృవు మోడీతో ఢీ: కమల్ హాసన్-ఒవైసీ దోస్తీ: ఎంఎన్ఎం-ఎంఐఎం పొత్తు: రజినీ ఎంట్రీతో

ఆశ్రమ్ పేరుతో కొంతకాలంగా వెబ్ సిరీస్ ఓవర్ ద టాప్ (ఓటీటీ)ల్లో ప్రసారమౌతోంది. ఇప్పటికే రెండు సీజన్లకు సంబంధించిన ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. ఆశ్రమాలు, బాబాలను కథాంశంగా తీసుకుని రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. బాబా పాత్రలో బాబీ డియోల్ నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు ప్రకాష్ ఝా నిర్మాత. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సిరీస్. తాజాగా ప్రసారం చేసిన కొన్ని ఎపిసోడ్లలో బాబాలు, ఆశ్రమాలను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పలు వివాదాలు చుట్టుముట్టాయి.

Ashram web series: Notice issued to actor Bobby Deol and Producer Prakash Jha by a Jodhpur court

తాజాగా దీనిపై జోధ్‌పూర్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. బాబీ డియోల్, ప్రకాష్ ఝాలకు వ్యతిరేకంగా స్థానికులు కేసు వేశారు. కుశ్ ఖండెల్వాల్ అనే వ్యక్తి జోధ్‌పూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. అది విచారణకు వచ్చింది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో హిందువుల మనోభావాలను కించపరిచేలా, బాబాలు, ఆశ్రమాల పట్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా అనేక సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాంటూ కుశ్ ఖండేల్వాల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై వాదోపవాదాలను విన్న తరువాత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర జోషీ.. బాబీ డియోల్, ప్రకాష్ ఝాలకు నోటీసులను జారీ చేశారు.

తదుపరి విచారణను వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేశారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ సిరీస్‌లో బాబీ డియోల్.. కాశీపూర్ బాబా నిరాలా పాత్రను పోషించారు. అద్భుతంగా నటించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు.. ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ వ్యాపారం, మనుషుల అక్రమ రవాణాను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆదితి పోహన్‌కర్, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్, తుషార్ పాండే, అనుప్రియా గోయెంకా, త్రిధా చౌధరి, సచిన్ ష్రాఫ్ వంటి నటులు నటించారు.

English summary
Rajasthan: Notice issued to actor Bobby Deol and Producer Prakash Jha by a Jodhpur court in a case filed against Ashram web series. Next hearing of the case on January 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X