వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 ఏళ్లుగా ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తున్నాం, నిషేధం బాధ కలిగించింది: ఆసియానెట్ ఎడిటర్..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక ఆందోళనల్లో అసత్య వార్తలు ప్రసారం చేశారని ఆసియానెట్, మీడియా వన్ సంస్థలపై కేంద్ర సమాచార శాఖ 48 గంటలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆసియానెట్ ఎడిటర్ ఎంజీ రామచంద్రన్ స్పందించారు. గత 25 ఏళ్లుగా ఉన్నత ప్రమాణాలతో ఆసియానెట్ పనిచేస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. కానీ శుక్రవారం సమాచార, ప్రసార శాఖ తీసుకున్న నిర్ణయంతో కలచివేసిందని పేర్కొన్నారు. 25 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆయన వివరించారు. కానీ ఐ అండ్ బీ ఆదేశంతో చానెల్ ప్రసారాలు నిలిపివేసి, విధులనుంచి తప్పుకున్నామని తెలిపారు.

 asianet working highest standards for 25 years: editor

అతీతులం కాదు.. కానీ..
దేశంలో ప్రతీ ఒక్కరు, ఒక సంస్థ.. చట్టం, న్యాయం ముందు అందరూ సమానమేనని రామచంద్రన్ తెలిపారు. అందుకు మేం అతీతులం ఏం కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా కూడా అలానే పనిచేస్తుందని... ఆసియానెట్ కూడా అలా వ్యవహరించిందని చెప్పారు. అయితే ఢిల్లీ ఆందోళనలో నెలకొన్న అభ్యంతరాలను తాము కూడా అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు. కానీ ఘటనకు సంబంధించి సమాచార, ప్రసారాల శాఖ తమను సంప్రదించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

నిబంధనల మేరకే..
ప్రజాస్వామ్య దేశంలో నాలుగో స్తంభమైన మీడియా పనిచేస్తోందని.. ఆసియానెట్ కూడా నిబంధనల మేరకు పనిచేస్తోందని చెప్పారు. తమ చానెల్‌పై నిషేధం తొందరపాటు చర్య అయి ఉంటుందన్నారు. దీనిపై సమాచార, ప్రసారాల శాఖ, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిర్ణయాన్ని సమీక్షించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ ఆసియానెట్ మాత్రం తన పరిధిలో పనిచేస్తుందని.. వీక్షకులు కచ్చితమైన, నిష్పాక్షిపాతమైన సమాచారం అందజేస్తుందని పేర్కొన్నారు.

ఇదీ కారణం
సీఏఏ ఆందోళనతో ఆసియానెట్ చానెల్ మృతుల సంఖ్యను ఎక్కువ చూపిందని సమాచార, ప్రసారాల శాఖ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 48 గంటలపాటు బ్యాన్ విధించడంతో.. ఇవాళ ఎడిటర్ రామచంద్రన్ స్పందించారు. తమ చానెల్‌పై నిషేధం గురించి ఒక నోట్ విడుదల చేశారు.

English summary
asianet working highest standards for 25 years editor ramachandran said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X