వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలకు మాత్రమే: లాక్‌డౌన్‌పై పిల్లలు రాసిన వ్యాసాలను పంపండి..వన్ ఇండియా పబ్లిష్ చేస్తుంది

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్ కనుగొనలేదు. అయితే పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి.

కరోనావైరస్‌నుంచి విముక్తి పొందాలంటే ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిపై విజయం సాధించొచ్చని వెల్లడిస్తోంది. ఇందులో ముఖ్యమైనది సోషల్ డిస్టెన్సింగ్, స్వీయ నిర్బంధంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఐదువందలకు పైగా జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం గట్టిగా చెప్పడంతో ప్రజలంతా మెజార్టీ సమయాన్ని ఇళ్లల్లోనే గడిపేస్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

Ask your children to pendown their thoughts on lockdown, oneindia will publish their thoughts

ఇక ఇళ్లకే పరిమితం కావడం ఎంత కష్టంగా ఉంటుందో తెలిసిందే.మీరు మీ ఇళ్లల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో ఇతరులకు మా వన్ ఇండియా ద్వారా తెలియజేయండి. ఇప్పటి వరకు మీకు మాత్రమే అవకాశం కల్పించిన వన్ ఇండియా ఇప్పుడు మీ పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తోంది. మీరు చేయవలిసిందల్లా మీ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు.. స్కూళ్లు మూసివేశారు కాబట్టి వారు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో చెబుతూ మాకు వారి ఫోటోలను పంపండి. అంతేకాదు పిల్లలు కరోనావైరస్ పై తమ స్వహస్త్రాలతో రాసిన లేఖలను, వ్యాసాలను, కూడా ఫోటో తీసి పంపితే వన్ ఇండియా ప్రచురిస్తుంది. లాక్‌డౌన్ పై పిల్లల ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మాకు వీడియో రూపంలో పంపొచ్చు.

ఈ ఫోటోలు లేదా వీడియోలను ఈ కింద ఇచ్చిన మెయిల్ ఐడీకి పంపించండి. వీటిని వన్‌ఇండియా వెబ్‌సైట్‌పై పోస్టు చేస్తాం. మీ చిన్నారులు చేసే చిలిపి అల్లర్లు, ముద్దుముద్దు మాటలు, ఫోటోలు వీడియోలను మేము పోస్టు చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం చిన్నారుల సెల్ఫీ ఫోటోలు వీడియోలు పంపాల్సిన మెయిల్ ఐడీ: [email protected]

English summary
Here is an opportunity to the viewers where they can take the selfies of the preventive measures being taken to avoid Coronavirus. This is one initiative where one can share his views and measures to the others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X