వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Airport: 11 మంది ఆర్మీ సిబ్బంది అరెస్టు, ఎయిర్ పోర్టు దగ్గర ఏంపని ? ఎవరు వీళ్లు ?, నకిలీ కార్డులే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ గౌహతి: భారత ఆర్మీ దుస్తులు (యూనీఫామ్) వేసుకున్న 11 మంది నకిలీ ఉద్యోగులు ఎయిర్ పోర్టు సమీపంలో అనుమానాస్పదంగా తిరగడంతో అరెస్టు చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వాళ్లు ఆర్మీ ఉద్యోగులు అని గుర్తించడానికి ఒక్కరి దగ్గర ఒక్క ఐడీ కార్డుకూడా లేదు.

నిందితులు నివాసం ఉంటున్న ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు షాక్ కు గురైనారు. నిందితులు ఉన్న ఇంట్లో అన్నీ నకిలీ గుర్తింపు కార్డులు బయటపడటంతో అందర్నీ విచారణ చేస్తున్నారు. ఈ 11 మంది ఎవరు ? ఎందుకు ఆర్మీ యూనీఫామ్ వేసుకుని ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Ex lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలోEx lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలో

LGBI Airport

LGBI Airport

అసోంలోని గౌహతి (గువహతి)లో ఎల్ జీబీఐ ఎయిర్ పోర్టు ఉంది. ఎల్ జీబీఐ ఎయిర్ పోర్టు దగ్గర 24 గంటలు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసోంలో నక్సల్స్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎల్ జీబీఐ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

 భారత్ ఆర్మీ యూనీఫామ్

భారత్ ఆర్మీ యూనీఫామ్

ఎల్ జీబీఐ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు భారత్ ఆర్మీ యూనీఫామ్ వేసుకుని అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం స్థానిక పోలీసులు గుర్తించారు. ఆర్మీ దుస్తుల్లో ఉన్న యువకులను పోలీసులు ప్రశ్నించారు. తాము ఆర్మీ సిబ్బంది అని ఒకసారి, సెక్కూరిటీ సిబ్బంది అని మరోసారి ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్థానిక పోలీసులకు అనుమానం వచ్చింది.

నలుగురి దెబ్బకు 11 మంది అరెస్టు

నలుగురి దెబ్బకు 11 మంది అరెస్టు

ఆర్మీ దస్తుల్లో ఉన్న నలుగురు యువకులు పోలీసులపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ నలుగురు యువకులతో పాటు మరో 7 మంది ఇలాగే ఆర్మీ దస్తులు వేసుకుని సంచరిస్తున్నారని గుర్తించిన పోలీసు అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక్క ఐడీ కార్డు లేదు

ఒక్క ఐడీ కార్డు లేదు

ఆర్మీ దస్తుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 11 మందిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 11 మంది దగ్గర వాళ్లు ఆర్మీ ఉద్యోగులు అని చెప్పడానికి ఎలాంటి ఐడీ కార్డులు లేవని గౌహతి అడిషనల్ పోలీసు కమిషనర్ దేబ్రాజ్ ఉపాధ్యాయ మీడియాకు చెప్పారు. 11 మంది వారి గుర్తింపు కార్డులు చూపించడంలో విఫలం అయ్యారని గౌహతి అడిషనల్ పోలీసు కమిషనర్ దేబ్రాజ్ ఉపాధ్యాయ అన్నారు.

Recommended Video

Rain Fall Across Country ఈ సీజన్‌ మొత్తం 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం : IMD || Oneindia
ఇంట్లో నకిలీ గుర్తింపు కార్డులు

ఇంట్లో నకిలీ గుర్తింపు కార్డులు

11 మంది అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారని, వారి ఇంట్లో సోదాలు చెయ్యగా అనేక నకిలీ గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) బయటపడ్డాయని గౌహతి అడిషనల్ పోలీసు కమిషనర్ దేబ్రాజ్ ఉపాధ్యాయ చెప్పారు. 11 మంది ఎవరు ? వీరి ప్లాన్ ఏమిటి ? ఎందుకు ఆర్మీ యూనీఫామ్ వేసుకున్నారు ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ పోర్టు దగ్గర ఆర్మీ దస్తుల్లో ఏకంగా 11 మంది నకిలీ ఆర్మీ ఉద్యోగులు అనుమానాస్పదంగా సంచరించి అరెస్టు కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

English summary
Assam: Guwahati police have arrested 11 men wearing the Indian Army uniform near LGBI airport after they couldn't show their identity cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X