వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శెభాష్ పోలీసు: కడు పేద బాలికకు టూ వీలర్, సైకిల్ మీద విజిటేబుల్స్ విక్రయం...

|
Google Oneindia TeluguNews

అసోంకి చెందిన బాలిక పోలీసుల మనస్సు గెలిచింది. పొట్ట కూటీ కోసం కూరగాయాలు అమ్ముకొని జీవిస్తున్న యువతి.. లాక్ డౌన్ సమయంలో ఇంటింటికీ వెళ్లి మరీ విజిటేబుల్స్ విక్రయించేంది. దీంతో తనకు ఆదాయం సమకూరేది.. దీంతోపాటు జనాలకు కూడా మేలు జరిగేది. అయితే ఆ యువతి ఇంటింటికీ వెళ్లి మరీ కూరగాయాలు విక్రయిస్తోన్న ఫోటోలు.. సోషల్ మీడియాలో ఫేర్ అయ్యాయి.. ఇంకేముంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డారు.

 తండ్రి అనారోగ్యం..

తండ్రి అనారోగ్యం..

అసోంలోని దిబ్రూగఢ్ జిల్లా బొబిబీల్ జిల్లాకు చెందిన జాన్మొని గొగొయ్.. తన పేరంట్స్‌తో కలిసి ఉంటోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోన్న విద్యార్థిని.. ఉన్న తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. కడు పేదరికంలో ఉన్న వీరి కుటుంబం.. తల్లి అమ్మే కూరగాయాలతో ఇల్లు గడుస్తోంది. తల్లి కష్టాన్ని చూడలేకపోయినా.. యువతి తాను కూడా కూరగాయాలు విక్రయించేంది. అయితే లాక్ డౌన్‌కు ముందు స్థానిక మార్కెట్‌కు వెళితే సరిపోయేది. లాక్ డౌన్ రావడం వల్ల కుటుంబం ఎలా గడపాలనే ప్రశ్న తలెత్తింది.

 సైకిల్ మీద వెళ్లి

సైకిల్ మీద వెళ్లి

తన సైకిల్ మీద కూరగాయాలు తీసుకెళ్లి ఇంటింటికి డోర్ డెలివరీ చేసేది. అలా కూరగాయాలు విక్రయించే సమయంలో ఫోటోలు క్లిక్ మనీ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసిందే. వెంటనే వారు పిలిపించి మాట్లాడారు. సాయం కావాలా అని ఎస్పీ శ్రీజిత్ అడిగినా.. అందుకు ఆమెకు ఆత్మభిమానం అడ్డొచ్చింది. లాభం లేదునుకొని.. వారు మరిన్ని కూరగాయాలు విక్రయించేందుకు టూ వీలర కావాలని చెప్పి.. ఒప్పించి ఆమెకు వాహనం అందజేశారు.

 టూ వీలర్

టూ వీలర్

తన కష్టాన్ని గుర్తించి వాహనం అందజేసిన.. ఎస్పీ, డీఎస్పీకి యువతి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు యువతి ఆశయం మేరకు ఉన్నత చదువులు చదవాలని పోలీసు పెద్దలు ఆశీర్వదించారు. ఏ సాయం కావాలన్నా తమను అడగాలని కోరారు.

English summary
Assam Police, has gifted a two-wheeler to a 20-year-old woman of Dibrugarh district who has been for selling vegetables door to door on a bicycle to back her parents during the ongoing lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X