వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో వరద బీభత్సం: లఖీమ్‌పూర్‌లో ఇద్దరు మృతి, 29 వేల మందిపై తీవ్ర ప్రభావం..

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలు, వరదలు అసోంపై తీవ్ర ప్రభావం చూపించాయి. వర్షపునీరు వరదగా మారి లోతట్టు ప్రాంతాల్లోకి చేరిపోతోంది. దీంతో లఖీమ్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం ఇద్దరు చనిపోయారు. జిల్లాలో చనిపోయిన వారి సంఖ్య 112కి చేరింది. వరదల ప్రభావం లఖీమ్ పూర్ దేమ్ జీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రెండు జిల్లాల్లో 29 వేల మంది ఎఫెక్టుకు గురయ్యారు.

Recommended Video

Assam Floods : అసోంపై భారీ వర్షాలు, వరదల ప్రభావం ! పొంగి ప్రవహిస్తున్ననదులు !! || Oneindia Telugu

సింగోరో, రొన్ గనడీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 54 జిల్లాల్ల గల 3 వేల హెక్టార్ల పంటపై ప్రభావం చూపిందని అసోం విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొన్నది. లఖీమ్ పూర్ దలుహత్ వద్ద సింగిరీ నదీ ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయింది. జిల్లాలో మరో ఏడు చోట్ల కూడా రోడ్డు దెబ్బతింది. వర్షం, వరదలతో చాలా మంది ప్రజలు ఇళ్లను వదిలి షెల్టర్ హోంలలోకి వెళ్లుతున్నారు.

Assam flood claims 2 lives in Lakhimpur, 29,000 people affected..

అసోంలో గల జిల్లాల్లో 57 లక్షల మంది ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని అధికారులు లెక్కవేశారు. మరోవైపు లఖీమ్ పూర్ వద్ద గల నారాయణ్ పూర్ వద్ద వంతెనపై ఓ టూ వీలర్ వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అదీ విరగడంతో టూ వీలర్ సహా అతను పడిపోయాడు. కానీ స్థానికులు వెంటనే స్పందించి.. టూవీలర్ సహా అతనిని కాపాడారు.

English summary
Assams Lakhimpur Daluhat area, the Singori river washed away a portion of the road and besides damaging seven other roads in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X