వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

68 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 8.69 లక్షల మందిపై ప్రభావం...

|
Google Oneindia TeluguNews

గౌహతి : భారీ వర్షాలు, వరదలతో అసోం అతలాకుతలమైంది. వరదనీరు పోటెత్తడంతో సమీప ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు నదుల్లోకి కూడా నీరు ఎక్కువగా చేరడంతో దిగువకు వదులుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటికే దిగువ ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. రాష్ట్రంలో మెజార్టీ జిల్లాలు వర్షపు వరద ప్రభావం చూపింది.

వర్ష బీభత్సం ..
ఓ వైపు వర్షాలు, మరోవైపు వరదనీర అసోంపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 21 జిల్లాలో వరద ప్రభావం ఉంది. వర్ష బీభత్సంతో ముగ్గురు చనిపోగా .. మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. మరోవైపు నదుల్లోకి ప్రమాదస్థాయిలో నీరు చేరుతుంది. ముఖ్యంగా బ్రహ్మపుత్ర, బర్షిదిహంగ్, ధాన్‌సిరి, దేశాంగ్, జియా భారలి, కొపిలి, పుతిమరి, బెకి, ఖటకల్, ఖుషియార నదులు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే దిగువ ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Assam flood situation worsens; 8.69 lakh people in 21 districts affected

వరదనీటితో దేమజి, లఖిమ్‌పూర్, బిశ్వాంత్, సోనిట్‌పూర్, ధారండ్, బక్షా, బర్పెట, నల్బరి, చిరాంగ్, బొంగ్‌గైగన్, కొక్రాఝర్, గోల్పారా, మోరిగన్, హోజై, నాగోన్, గోలఘాట్, మజూలీ, జోర్హాట్, దిబ్రుఘడ్, టిన్ సూకియా, సిబాసాగర్ జిల్లాలపై ప్రభావం చూపింది. ఆయా జిల్లాలకు చెందిన ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్ష ప్రభావంతో 68 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,556 గ్రామాల్లో గల 8.69 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపిందని అసోం విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఇప్పటికే 7,600 మంది ప్రజలకు 68 పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు అందిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వర్ష బీభత్సంతో దాదాపు 27 వేల 864 హెక్టార్ల పంట నష్టపోయినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

English summary
Four more districts in Assam were flooded on Friday taking the number of affected districts to 21 out of the 33 districts in the state. Three more people were killed taking the total to 6 deaths. Almost all rivers are in spate. Brahmaputra, Burhidihing, Dhansiri, Desang, Jia Bharali, Kopili, Puthimari, Beki, Katakhal and Kushiyara are flowing over danger mark at several places in the state. According to a report by Assam State Disaster Management Authority (ASDMA), over 8.69 lakh people in 1,556 villages of 68 revenue circles have been affected by the second wave of flooding in the state this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X