India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో జల ప్రళయం: 73కు చేరిన మృతులు, బాధితులుగా 43 లక్షల మంది

|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
గత 24 గంటల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 11 మంది మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వార్తా సంస్థ ANI నివేదించింది. వర్షాలు, వరదల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రెండుసార్లు ఫోన్ చేశారు.

తొలి ఫోన్ కాల్‌లో వరద పరిస్థితిపై ఆరా తీయగా, రెండో ఫోన్ కాల్‌లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి రానుందని సమాచారం.

ఈశాన్య రాష్ట్రమైన అస్సాం గత వారం రోజులుగా విధ్వంసకర వరదల ప్రభావంలో చిక్కుకుంది. 36 జిల్లాల్లో 33లో దాదాపు 43 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ ఏడాది అసోంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 73 మంది చనిపోయారు.

 Assam Floods: 11 Killed In 24 Hours, Nearly 43 Lakh People Affected

"అస్సాం, మేఘాలయ వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాలను అంచనా వేయడానికి అంతర్-మంత్రిత్వ కేంద్ర బృందం (IMCT) సందర్శిస్తుంది. అంతకుముందు వరదలు సంభవించిన తర్వాత, 2022 మే 26 నుంచి 29 మే 29 వరకు అస్సాంలోని ప్రభావిత ప్రాంతాలను IMCT సందర్శించింది," అని అమిత్ షా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

"భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల పరిస్థితిపై చర్చించేందుకు అస్సాం సీఎం హిమంతబిస్వా, మేఘాలయ సీఎం సంగ్మాకాన్రాడ్‌తో మాట్లాడాను. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం అస్సాం, మేఘాలయ ప్రజలకు అండగా నిలుస్తుంది" అని అమిత్ షా ట్వీట్ చేశారు. .

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. "అసోంలో వరద పరిస్థితి గురించి ఆరా తీయడానికి అమిత్ షా జీ ఉదయం నుంచి రెండుసార్లు కాల్ చేశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో అధికారుల బృందాన్ని పంపుతుందని ఆయన తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా. హోంమంత్రి చేసిన సహాయానికి కృతజ్ఞతలు' అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

'అసోం చరిత్రలో తొలిసారిగా, జూన్ 21న ప్రత్యేక ఐఏఎఫ్ విమానం 1 లక్ష లీటర్ల డీజిల్, పెట్రోల్‌ను సిల్చార్‌కు తీసుకువెళుతుంది. ఈశాన్య సరిహద్దు రైల్వే కూడా ప్రత్యేక సహాయ రైలును నడపడానికి అంగీకరించింది' అని సిఎం శర్మ చెప్పారు.

అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా శనివారం అస్సాం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు, వరద పరిస్థితిని సమీక్షించడానికి సీఎం శర్మ.. రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు, జిల్లా డిప్యూటీ కమిషనర్లతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. NDRF లేదా SDRF పడవలు ఇంకా చేరుకోని ప్రాంతాలకు సహాయక సామగ్రిని రవాణా చేయడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) సహాయం తీసుకోవాలని శర్మ డిప్యూటీ కమిషనర్‌లను కోరారు.

English summary
Assam Floods: 11 Killed In 24 Hours, Nearly 43 Lakh People Affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X