వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కన్నుమూత.. మంచి నాయకుడిని కోల్పోయామన్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సోమవారం తుది శ్వాస విడిచారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికితస్ పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Assam former CM Tarun Gogoi passes away with post covid complications

తరుణ్ గోగొయ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తరుణ్ గొగోయ్ ఓ గొప్ప నాయకుడే కాకుండా మంచి పరిపాలనాధ్యక్షుడని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు తరుణ్ గొగోయ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ఇక ఈ నెల 2వ తేదీ నుంచి ఆయన గౌహతి వైద్య కళాశాల ఆసుపత్రిలో తరుణ్ గొగోయ్ చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వశర్మ వెల్లడించారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఫలితంగా ఆయనను వెంటిలేటర్‌పై ఉంచినట్లు చెప్పారు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, వైద్యానికి శరీరం స్పందించట్లేదని, కొన్ని అవయవాలు పనిచేయట్లేదని పేర్కొన్నారు. ఆయనకు క్రమం తప్పకుండా నాణ్యమైన చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు.

కానీ బ్లడ్ ప్రెషర్‌ స్థిరంగా ఉండట్లేదని, తరచూ హెచ్చుతగ్గులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు అన్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకే వెంటిలేటర్‌పై ఆయనను ఉంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. చివరగా సోమవారం పరిస్థితి మరింత ఆందోలనకరంగా మారిందని ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

Recommended Video

Sabarimala Review Petition : All Eyes On Supreme Court Verdict || ఈ వారంలోనే సుప్రీమ్ కోర్ట్ తీర్పు

86 సంవత్సరాల తరుణ్ గొగోయ్.. మూడుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యం వల్ల క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ రాజకీయాల్లో ఉన్నారు. కాలియాబోర్ లోక్‌సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు.

English summary
Assam former Chief Minister Tarun Gogoi passed away on Momday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X