వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమీ పని అదీ.. చచ్చినా కూడా దాడి చేసి, తన్ని.. ఓ ఫోటోగ్రాఫర్ కర్కశత్వం..

|
Google Oneindia TeluguNews

అసోంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డారంగ్ జిల్లా ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపైకి వారు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడ్డ ఒకరిని జర్నలిస్ట్ దాడిచేసినట్టు ఫుటేజీ కనిపించింది. చచ్చినా వదల్లేదు. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ ఎవరో కనుక్కొని.. అదుపులోకి తీసుకున్నారు.

గాయపడ్డ వ్యక్తిని ఫోటో గ్రాఫర్ దాడి చేశారు. అతనిని విజయ్ శంకర్ బానియాగా పోలీసులు తెలిపారు. అతను ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అని వివరించారు. ఒక డాక్యుమెంట్ కోసం అసోం ప్రభుత్వం అతనికి బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే అతను ఇలా నిరసనకారులతో బిహేవ్ చేయడం విమర్శలకు దారితీసింది. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తిని బనియా దాడిచేసినట్టు కనిపించింది. ఘర్షణ చెలరేగడంతో చెట్లమాటున ఉండి పోలీసులు టియర్ గ్యాస్.. ఆ తర్వాత కాల్పులు జరిపారు. గాయపడ్డ అతనిపై బానియా దూకాడు. దాడి చేశాడు. అతను చనిపోయినా తన మూర్ఖత్వాన్ని వీడలేదు. అక్కడినుంచి బనియాను వెళ్లాలని పోలీసులు కోరినా.. పెడచెవిన పెట్టాడు. పట్టించుకోలేదు.

 Assam Police arrests photographer seen thrashing injured man

ప్రభుత్వ ఫామింగ్ ప్రాజెక్టు కోసం ఆక్రమణలకు పాల్పడినవారిని అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అందుకు నిరాకరించిన ఆందోళనకారులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపాల్సి వచ్చింది. దీంతో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. అందులో ఒక ఆందోళనకారుతో ఫోటోగ్రాఫర్ అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Recommended Video

విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!

ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు గాయపడ్డారని డారంగ్ ఎస్పీ సుశాంత్ బిశ్వ శర్మ తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులకు గాయాలయ్యాయని తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. గాయపడిన 9 మంది పోలీసులు కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.

English summary
Assam Police arrested the photographer who was seen assaulting an injured protester during the firing incident at the Dholpur Gorukhuti area in the state's Darrang district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X