• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అస్సాం మొదటి దశ ఎన్నికలు : బరిలో సీఎం సర్బానంద సోనోవాల్ తో పాటు హేమాహేమీలు .. ఇదే కీలక దశ

|

2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశలలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా మరియు స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి వంటి అతి ముఖ్య నేతలు ఈరోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోపోతున్నారు. ఓటర్లు ఎవరికి అనుకూలంగా తమ తీర్పును నమోదు చేస్తారు అన్న ఆందోళన సర్వత్రా అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

పశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపుపశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపు

 నేడు జరుగుతున్న మొదటి దశ పోలింగ్ లోనే కీలక స్థానాలు

నేడు జరుగుతున్న మొదటి దశ పోలింగ్ లోనే కీలక స్థానాలు

మొదటి దశలో మొత్తం అప్పర్ అస్సాం ప్రాంత ఓటింగ్, అలాగే సెంట్రల్ అస్సాం యొక్క కొన్ని భాగాలు ఉన్నాయి. మొత్తంమీద, 126 నియోజకవర్గాల్లో 47 నియోజకవర్గాలలో ఓటర్లు ఈ దశలో ఓటు వేయనున్నారు. బిజెపి-ఎజిపి కలయిక మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని 'మహాజోత్ (గ్రాండ్ అలయన్స్) హోరాహోరీగా తల పడుతున్న పరిస్థితి అస్సాంలో కనిపిస్తుంది

. 2016 ఎన్నికల్లో బిజెపి మొదటి దశలో ఎన్నికల బరిలో ఉన్నా 35 నియోజకవర్గాల్లో సీట్లను కైవసం చేసుకుంది. మరి ఈసారి ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నది తేలాల్సి ఉంది.

మజులి నుండి ఎన్నికల బరిలో అస్సాం సీఎం సర్భానంద సోనోవాల్

మజులి నుండి ఎన్నికల బరిలో అస్సాం సీఎం సర్భానంద సోనోవాల్

ఈ ఎన్నికలు బిజెపి '10 వాగ్దానాలు 'మరియు కాంగ్రెస్ 5 హామీల మధ్య పోరుగా కనిపిస్తుంది. అస్సాంలో తేయాకు తోటల కార్మికుల ఓట్లు కీలకమైన ఓటు బ్యాంకు కాగా వారు ఎవరిని ఆదరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

ముఖ్యమంత్రి సోనోవాల్ తన మజులి నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు . బిజెపి నుండి బరిలోకి దిగిన ఆయన విజయం సాధిస్తారని ధీమాలో ఉన్నారు . అయితే మరోమారు ఆయన ముఖ్యమంత్రి అన్న విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తన హయాంలో గత ఐదు సంవత్సరాలుగా మజులీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది అని ఆయన భావిస్తున్నారు.

 బరిలో అస్సాం స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, అస్సాం కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా గోహ్పూర్ తదితరులు

బరిలో అస్సాం స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, అస్సాం కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా గోహ్పూర్ తదితరులు

ప్రస్తుతం అస్సాం స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రానా గోస్వామితో జోర్హాట్ కోసం తలపడుతున్నారు. అస్సాం కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా గోహ్పూర్ నుండి సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే ఉత్పాల్ బోరాతో పోటీలో ఉన్నారు. రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్, పార్టీ సకాలంలో నమోదు కానందున సిబ్సాగర్ నుండి ఇండిపెండెంట్‌గా పోటీ పడుతున్నారు . గోగోయి, 2019 సిఎఎ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నందుకు జైలుకు కూడా వెళ్లారు . అతని కోసం ప్రచారం చేసిన వారిలో అతని 84 ఏళ్ల తల్లి ప్రియాడా గొగోయ్ కూడా ఉన్నారు.

 మొదటి దశ ఎన్నికల బరిలో పలువురు బీజేపీ మంత్రులు

మొదటి దశ ఎన్నికల బరిలో పలువురు బీజేపీ మంత్రులు

గత ఏడాది నవంబర్‌లో మరణించిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖుడు తరుణ్ గొగోయ్ వరుసగా నాలుగుసార్లు పదవిలో ఉన్న టైటాబోర్ లో ఆయన సీటులో కాంగ్రెస్ భాస్కర్ జ్యోతి బారువా, బిజెపికి చెందిన హేమంత కలిత తో తలపడుతున్నారు. రంజిత్ దత్తా, నాబా కుమార్ డోలే, జోగెన్ మోహన్ మరియు తేరాష్ గోవాలా, వీరంతా బిజెపి నాయకులు మరియు మంత్రులు. వారు వరుసగా బెహాలి, కాకువా, మహమోరా మరియు దులియాజన్ నుండి పోటీ లో ఉన్నారు .

 నేడు 81 లక్షల మంది ఓటర్ల తీర్పు .. సర్వత్రా ఉత్కంఠ

నేడు 81 లక్షల మంది ఓటర్ల తీర్పు .. సర్వత్రా ఉత్కంఠ

మొదటి దశలో సుమారు 81 లక్షల మంది ఓటు వేయడానికి అర్హులు . దాదాపు 2 వేల పోలింగ్ స్టేషన్లతో సహా 11,000 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటకు వస్తున్నారు. మూడు దశల ఎన్నికల ఫలితాలు మే 2 న ప్రకటించబడతాయి.

English summary
The first of three phases of the 2021 Assam Assembly election begins today with Assam Chief Minister Sarbananda Sonowal, state Congress chief Ripun Borah and Speaker Hitendranath Goswami among the biggest names on the ballots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X