వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలటరీ వాహనాలపై ఉగ్రవాదుల దాడి, ఇద్దరు మృతి

అసోం ..అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని మిలటరీ వాహనాలపై గుర్తుతెలియని దుండగులు దాడులకు దిగారు. ఈ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గువహటి :పర్యాటకులకు రక్షణగా వెళ్తోన్న అసోం రైఫిల్స్ కు చెందిన వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడికి పాల్పడింది ఉగ్రవాదులుగా

అనుమానిస్తున్నారు పోలీసులు.ఈ ఘటన అసోం ..అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోచోటుచేసుకొంది.

అసోం లోని టిన్ సుకియ జిల్లాలోని 53వ, జాతీయ రహదారిపై జాగున్ 12, మైల్ బారబస్త వద్ద మిలటరీ వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ తో దాడికి దిగారు.

attack

అనంతరం కాల్పులకు దిగారు. ఈఘటనలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

దాడులకు పాల్పడింది ఉగ్రవాదుల పనేనని రక్షక దళాలు అనుమానిస్తున్నాయి.అయితే వెంటనే జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు.
పాంగ్ సౌ ఉత్సవానికి వెళ్లోస్తోన్న పర్యాటకులకు గస్తీగా మూడు మిలటరీ వాహనాలు వెళ్తున్నాయి.

అయితే మిలటరీ వాహనాలే లక్ష్యంగా దాడులు జరగడంతో ఉగ్రమూకల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.జాతీయ రహదారికి ఇరువైపులా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి రక్షకదళాలు.ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయమై ఆరాతీస్తున్నారు.

English summary
suspected unknown persons attacked on millitary vehichles in assam and arunachal border . two persons dead in this incident,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X