వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చమురు బావిలో భారీ అగ్ని ప్రమాదం: ఇద్దరు మృతి, కేంద్ర సాయం కోరిన సీఎం

|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాంలో ఆయిల్ ఇండియాకు చెందిన పైప్ లైన్ నుంచి లీకై భారీ మంటలు ఎగిసిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. గత 14 రోజులుగా పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండగా.. మంగళవారం మంటలంటుకున్నాయి. టాక్సికియా జిల్లాలోని భాగ్జన్ గ్యాస్ బావికి మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారిని అక్కడ్నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు

భారీగా మంటలు ఎగిసిపడుతుండగా.. దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలుముకున్నాయి. ఈ మంటలు చాలా కిలోమీటర్ల దూరంలోని డిడ్రూ షైకోవా నేషనల్ పార్క్ నుంచి కూడా కనబడుతుండటం గమనార్హం.

Assam: Tinsukia gas well blowout kills two IOC firefighters

మంగళవారం మధ్యాహ్నం ఈ మంటలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి
కారణం మాత్రం తెలియదని ఆయిల్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్ సీనియర్ మేనేజర్ జయంత్ బోరుముండి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ఓఎన్జీసీ అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

చమురు బావికి మంటలంటుకోవడంతో సింగపూర్ నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రమాద ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Assam: Tinsukia gas well blowout kills two IOC firefighters

భగ్జన్ చమురు బావిలో గ్యాస్ నిక్షేపాల వెలికితీత జరుగుతుండగా.. మే 27నే మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మే 27న మొదలైన మంటలను అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, 3229 మీటర్ల లోతులో సహజ వాయువు, చమురు వెలికితీత జరుగుతోంది.

Recommended Video

India Flooded with Love : Bihar People offering Food to Mizo Passengers in Train

అగ్ని ప్రమాదంలో నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మాట్లాడారు. మంటలు అర్పేందుకు సాయం కావాలని కోరారు. దీంతో వాయుసేకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగారు.

English summary
Two firefighters of Oil India Ltd who had gone missing were found dead near the oil well fire in Assam, as per official sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X